Anandayya : అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి పోలీసులు.. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి తయారీ సామాగ్రి స్వాధీనం

Anandayya Ayurveda corona medicine : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా ముందుకు మరోసారి బ్రేక్ పడింది.

Anandayya : అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి పోలీసులు.. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి తయారీ సామాగ్రి స్వాధీనం
Ap Police Seized Anandayya
Follow us
Venkata Narayana

| Edited By: Team Veegam

Updated on: May 22, 2021 | 1:08 PM

Anandayya Ayurveda corona medicine : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా ముందుకు మరోసారి బ్రేక్ పడింది. అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి , మందు పంపిణీ కేంద్రానికి పోలీసులు చేరుకున్నారు. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి.. మ౦దు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ్టి నుంచి ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు మందు పంపిణీ లేదని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు. మందు కోసం ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు పోలీసులు అదనపు భద్రత కల్పించారు. కాగా, ఆనందయ్య మందుపై కృష్ణపట్నంలో ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుండగా, ఇవాళ ఐసీఎంఆర్ టీమ్ తో కలిసి మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఒక ఐసీఎంఆర్ బృందం నిన్ననే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చేరుకుంది. ఈ సందర్భంగా కరోనా ఆయుర్వేద మందుగా ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందు లో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు ఎలా తయారు చేస్తున్నారు అనే విషయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయుర్వేద మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా అనే విషయాన్ని ఐసీఎంఆర్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తదితరులు కూడా ఐసీఎంఆర్ బృందంతో ఉన్నారు.

ఇలా ఉండగా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తోన్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే, నిన్న మళ్లీ కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా మందు కోసం జనం దాదాపు 50వేలు ఎగబడ్డారు. దీంతో మళ్లీ ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

Anandayya Corona Ayurveda Medicine

Anandayya Corona Ayurveda Medicine

Read aslo : INS Rajput : భారత్ మొదటి యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌’కి సూర్యాస్తమయ సమయంలో తుది వీడ్కోలు పలికిన తూర్పు నావికాదళం

Corona Cases India: కరోనా కల్లోలంలో గుడ్ న్యూస్.! పాజిటివ్ కేసులను అధిగమించిన రికవరీలు.. వివరాలివే.!

Chapatis At Night: రాత్రిపూట చపాతీలు తింటున్నారా.? అయితే మంచిదో.. కాదో.. తెలుసుకోండి.!