Anger Management: ఒకప్పుడు ప్రజలు కలివిడిగా ఉండేవారు. అందరూ కలిసి గంటలు గంటలు ముచ్చటించుకునేవారు. తమ సాదకబాదకలను ఒకరితో మరొకరు పంచుకునేవారు. అలా తమలోని భారాన్ని తొలగించుకునేవారు. కానీ నేటి కంప్యూటర్ యుగంలో నాటి పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. సంబంధాలు మొబైల్ ఫోన్లకే పరిమితం అయ్యాయి. ఆఫీసులు, బిజినెస్‌లు అంటూ.. కుటుంబంతో కొన్ని క్షణాలు కూడా గడపడానికి సమయం దొరకడం కష్టమవుతోంది. ఎవరు కూడా పరస్పరం మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితులు నేటి కాలంలో లేవు. మానవ జీవితం బాధ్యతల వలయంలో చిక్కుకుపోయింది.
ఈ రోజుల్లో ఒత్తిడి వంటి సమస్యలు సర్వసాధారణంగా మారడానికి కారణం ఇదే. ఒత్తిడి పరిమితికి మించి పెరిగినప్పుడు, అది డిప్రెషన్‌గా మారుతుంది. డిప్రెషన్ కారణంగా, వ్యక్తి సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోతాడు. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. ఈ పరిస్థితులను నివారించడానికి, మనస్సులోని కోపాన్ని తొలగించడం చాలా ముఖ్యం. మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడేందు 4 సులభమైన మార్గాలను నిపుణులు చెబుతన్నారు. మరి ఆ నాలుగు మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలా రిలాక్స్ అవ్వండి..
రోజంతా మీకు సమయం దొరికినప్పుడు, మీరు కొంత సమయం కూర్చుని డైరీని వ్రాయండి. మీ మనస్సులోని ప్రతి మంచి, చెడులను డైరీలో రాయండి. మీకు ఇబ్బంది కలిగించే వాటి గురించి రాయండి. మీ భావోద్వేగాలను బయటకు తీయడం ద్వారా, మనస్సు చాలా తేలికగా మారుతుంది. కాబట్టి రోజూ డైరీ రాయండి.
సంగీతం వినండి..
ఒత్తిడిని తగ్గించడానికి సంగీతం ఉత్తమ చికిత్సగా పరిగణించబడుతుంది. మీరు తప్పనిసరిగా కొన్ని సంగీత కార్యకలాపాలలో మమేకం అయ్యేలా చూసుకోండి. దీని కోసం, డ్యాన్స్ క్లాస్‌లో చేరండి. మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి నృత్యం పనిచేస్తుంది. పాటలు, గిటార్, ఏదైనా ఇతర వాయిద్యం నేర్చుకోవడానికి ట్రై చేయండి. సమయం తక్కువగా ఉంటే వారానికోసారి క్లాస్ తీసుకొని ఇంటికి వచ్చి రోజూ ప్రాక్టీస్ చేయండి. దీంతో, అనవసరమైన విషయాలు మీ మనస్సులోకి రావు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి అనుభూతి కలుగుతుంది.
నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి..
ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఎంతో కీలకం. చాలా ప్రభావవంతమైన మార్గం. ఏదైనా మిమ్మల్ని బాధించినప్పుడు, మీ సమస్యను మీరు విశ్వసించే వారికి చెప్పండి. వారి నుంచి సలహాలు స్వీకరించండి. వారి ద్వారా సమస్యకు పరిస్కారం పొందవచ్చు. మీ మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
ధ్యానం అలవాటు చేసుకోండి..
ధ్యానం మీలోని ఒత్తిడి దూరం చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీరు ధ్యానం చేయలేకపోతే, సాయంత్రం లేదా రాత్రి మీకు తీరిక దొరికినప్పుడు కొంత సమయం పాటు ధ్యానం చేయండి. ధ్యానం చేయడం ద్వారా మీ మనస్సు స్థిరంగా ఉంటుంది. మానసిక శాంతి లభిస్తుంది. అన్ని పనులను మెరుగైన రీతిలో చేయగలరు.
Also read:
SBI Apprentice Admit Card 2021: ఎస్‌బీఐ అప్రెంటిస్ ఎగ్గామ్ హాల్ టికెట్ విడుదల.. పూర్తి వివరాలివే..
Agency Rains: నాన్ స్టాఫ్ వర్షాలు.. వరద బీభత్సం. నడుముల్లోతు నీటితో మన్యంలో పరిస్థితి ఆగమ్యగోచరం
Ashu Reddy: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి.. ఇంతకీ కారణం ఏంటంటే.?