Amla Water: అన్ని సమస్యలకు చక్కటి ఔషధం.. ఉసిరి నీరు ఇలా తాగితే ఎన్నో ప్రయోజనాలు..

|

Sep 30, 2022 | 8:05 AM

ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఉసిరిలో ఔషధ గుణాలు, పోషకాలు అనేక సమస్యలను దూరం చేస్తాయి.

Amla Water: అన్ని సమస్యలకు చక్కటి ఔషధం.. ఉసిరి నీరు ఇలా తాగితే ఎన్నో ప్రయోజనాలు..
Amla Water
Follow us on

ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఉసిరిలో ఔషధ గుణాలు, పోషకాలు అనేక సమస్యలను దూరం చేస్తాయి. అందుకే ఉసిరిని ఆయుర్వేద ఔషధాల్లోనే కాకుండా అనేక చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ సప్లిమెంట్లలో కూడా ఉపయోగిస్తారు. ఇంకా దీనిని అనేక రకాలుగా తినవచ్చు. ఉసిరికాయను పచ్చడి, పొడి, మురబ్బా, ఉసిరి రసం ఇలా అనేక రకాలుగా తినవచ్చు. అయితే ఉసిరికాయ నీరు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పరగడుపున నీటిని తాగితే ఎన్నో పోషకాలు అందుతాయి. అటువంటి పరిస్థితిలో ఉసిరి నీటిని ఎలా తయారు చేసుకోవాలి.. దాని ప్రయోజనాలు ఏంటి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయ నీటిని తాగడం వల్ల శరీరానికి ఈ ప్రయోజనాలు కలుగుతాయి..

పొట్ట సంబంధిత సమస్యలు తొలగిపోతాయి: ఉసిరి నీటిని ఉదయాన్నే తాగితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, ఇతర పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కావున దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం మంచిదంటున్నారు.

చర్మం – జుట్టుకు మేలు: ఆమ్లా నీరు మంచి డిటాక్స్ డ్రింక్ లా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతోపాుట విషాన్ని తొలగిస్తుంది. దీని వల్ల ముఖంలో గ్లో వస్తుంది. మొటిమలు, మచ్చల సమస్య కూడా తొలగిపోతుంది. అంతే కాదు దీన్ని రోజూ తీసుకుంటే జుట్టు రాలడం, చుండ్రు సమస్య దూరమవుతుంది.

బరువు తగ్గుతారు: రోజూ ఉసిరికాయ నీటిని తాగితే ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల ఆహారం బాగా జీర్ణమై ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది: ఉసిరిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా ఇది కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉసిరికాయ రసం తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..