Tender Tamarind Leaves: చింతలన్నీ దూరం చేసే దివ్యౌషధం.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

వసంతకాలంలో సహజంగా లభించే పుల్లపుల్లగా ఉండే చింతచిగురు వంటలకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి ఉపయోగకరమైన గుణాలు ఉండటంతో ఆయుర్వేదంలోనూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడడంలో చింతచిగురు ఒక ప్రకృతి ప్రసాదంగా చెప్పవచ్చు.

Tender Tamarind Leaves: చింతలన్నీ దూరం చేసే దివ్యౌషధం.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Tender Tamarind Leaves

Updated on: May 28, 2025 | 8:28 PM

చింతచిగురు రసంలో ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే సూక్ష్మజీవి పెరగకుండా అడ్డుకునే శక్తి ఉంటుంది. ఇదే సూక్ష్మజీవి మలేరియా అనే తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. ఈ ఆకుల రసాన్ని తరచూ తాగడం ద్వారా మలేరియా రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవచ్చు.

మధుమేహం ఉన్నవారు ఆహారంలో చింతచిగురు వాడితే.. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే సహజ పదార్థాలు ఇన్సులిన్ పని తీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.

చింతచిగురు ఆకులు శరీరానికి శక్తినిచ్చే గుణాలు కలిగి ఉంటాయి. రక్తహీనత, శక్తి లోపం వల్ల వచ్చే కామెర్లకు ఇవి చాలా ఉపశమనం ఇస్తాయి. ఆకుల కషాయం లేదా రసం తాగడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

చింతాకుల్లో విటమిన్ సి (ఆస్కార్బిక్ ఆసిడ్) ఎక్కువగా ఉంటుంది. ఇది స్కర్వీ అనే వ్యాధిని నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా శరీరంలో విటమిన్ సి లోపం వల్ల వచ్చే మలినాలు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.

చింతచిగురు రసాన్ని గాయాలపై లేదా దద్దుర్లు, చర్మ ఇన్ఫెక్షన్లపై రాస్తే అవి త్వరగా నయం అవుతాయి. దీనిలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు చర్మంపై రక్షణ కవచంలా పని చేస్తాయి.

పాలిచ్చే తల్లులు చింతచిగురు రసం తీసుకుంటే.. పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు పాల నాణ్యత మెరుగుపడుతుంది. శిశువు ఆరోగ్యంగా పెరగడానికి ఇది సహాయపడుతుంది.

బహిష్టు సమయంలో వచ్చే నొప్పులు, ఇబ్బందులకు చింతచిగురు ఉపశమనం ఇస్తుంది. దీని ఆకులను ఆహారంగా తీసుకోవడం ద్వారా గర్భాశయ సంబంధిత నొప్పులు తగ్గుతాయి.

చింతచిగురు కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మూత్ర మార్గాలను శుభ్రంగా ఉంచి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది. అలాగే శరీరంలో వాయు, పిత్తం, కఫం సమతుల్యతను ఉంచడంలో చింతాకులు తోడ్పడతాయి.

చింతాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల.. కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలకు చింతచిగురు సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే నొప్పులకు ఉపశమనం అందించగల శక్తి దీనిలో ఉంటుంది.

చింతచిగురు మన వంటల్లో మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడాలనుకునే వారు, శరీరంలోని వ్యాధులను నివారించాలనుకునే వారు ఈ చింతచిగురును ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)