Best Fruit Juice: సమ్మర్ సీజన్‌ వచ్చేస్తోంది.. శక్తినిచ్చే పండ్ల రసాలు.. జ్యూస్‌లతో ఎలాంటి ప్రయోజనాలు..?

|

Feb 08, 2022 | 2:06 PM

Best Fruit Juice: సమ్మర్ సీజన్‌ వచ్చేస్తోంది. ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో నీరసం వస్తుంటుంది. అందుకే నీళ్లు ఎక్కువగా..

Best Fruit Juice: సమ్మర్ సీజన్‌ వచ్చేస్తోంది.. శక్తినిచ్చే పండ్ల రసాలు.. జ్యూస్‌లతో ఎలాంటి ప్రయోజనాలు..?
Follow us on

Best Fruit Juice: సమ్మర్ సీజన్‌ వచ్చేస్తోంది. ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో నీరసం వస్తుంటుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా త్వరగా అలసిపోకుండా ఉంటాము. ఇక వేసవిలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ. నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకుడా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

పండ్ల రసాయలు తాగడం వల్ల ప్రయోజనాలు

►ఈ పండ్ల రసాలతో విటమిన్‌-ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి.
► మలబద్దకం సమస్య తొలగిపోతుంది.
►ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు
►కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.
► చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి.
► పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి.
► ఎసిడిటి, అల్సర్‌ సమస్యను నివారిస్తాయి.
► నిమ్మకాయలు, మామిడి జ్యూస్‌లలో పోటాషియం బి6, బి1,బి2 విటమిన్స్‌ పుష్కలంగా అందుతాయి. అజీర్తి సమస్య దూరం అవుతుంది.
► శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.
► బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
► పుచ్చకాయలు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి
► గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
► డయాబెటిస్‌ వ్యాధి అదుపులో ఉంటుంది.
► శరీరంలో ఉన్న వ్యర్థలను తొలగించేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి:

Health Tips: ఈ ఆహారంతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

Papaya: బొప్పాయి తింటున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..