చలికాలంలో పొడి వాతావరణం కారణంగా రోగాల బారిన పడే ప్రమాదముంది. జలుబు,దగ్గు, శ్వాసకోస సమస్యలు,గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటారు. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్‌లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఆరోగ్యంగా లేకపోతే ఆర్థికంగా, శారీరకంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక చలికాలం మొదలైంది. చలికాలంలో పొడి వాతావరణం కారణంగా రోగాల బారిన పడే ప్రమాదముంది. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలు, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు చెక్ చెప్పడానికి కొన్ని ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలి. వంటింట్లో దొరికే చిన్న గింజలు ఎన్నో వ్యాధుల పనిపడతాయి. చలికాలంలో ఈ గింజల్ని ఒక స్పూన్ తింటే చాలు. కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంతకీ ఆ గింజలు ఏంటి అనుకుంటున్నారు. నువ్వులు. అవును మీరు వింటున్నది నిజమే.!
ఈ చిన్న గింజల్లో ఒక గ్లాస్ పాల కంటే 8 రెట్లు కాల్షియం ఎక్కువగా ఉంది. కాల్షియం మాత్రమే కాదు. నువ్వుల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, ఐరన్, జింక్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ఒక స్పూన్ నువ్వులు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
నువ్వులు.. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో ముందుంటాయి. అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లెజరిడ్‌తో బాధపడేవాళ్లు.. మీ ఆహారంలో నువ్వులు భాగం చేసుకుంటే సరిపోతుంది. హార్ట్ పేషెంట్ అయితే.. నువ్వులు తీసుకోవడం చాలా లాభం. ఎందుకంటే నువ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తాయి. దీంతో, గుండె జబ్బులు.. స్ట్రోక్ వంటి ముప్పు నుంచి మీరు తప్పించుకోవచ్చు. నువ్వుల్లో మన శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు, మోనో అన్‌శాచ్యురేటెట్ కొవ్వులు ఉంటాయి. అంతేకాకుండా లిగ్నన్స్, పైటోస్టెరాయిస్ వంటి సమ్మేళనాలు కూడా నువ్వుల్లో లభిస్తాయి. ఈ రెండూ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
రోజూ 40 గ్రాముల నువ్వుల్ని తింటే.. చెడు కొలెస్ట్రాల్ 10 శాతం తగ్గుతుందని నిపుణులు తెలిపారు. మరో వైపు ఈ రోజుల్లో చాలా మంది డయాబెటిస్ మహమ్మారితో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి నువ్వులు ఒక బెస్ట్ ఆప్షన్. నువ్వులు మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. వీటిని రోజూ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారి పెరగవు. 100 గ్రాముల తెల్ల నువ్వుల గింజలలో 12 గ్రాముల ఫైబర్, 18 గ్రాముల ప్రొటీన్ ఉంటాయి. అంటే ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అవుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి