
సపోటా పండు గురించి అందరికీ తెలుసు. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. చాలా మంది సపోటాలను ఇష్టంగా తింటారు. సపోటా అన్ని సీజన్స్‌లో లభ్యం కాదు. కాబట్టి సపోటాలను ఖచ్చితంగా అందరూ తినాల్సిందే. ఇందులో లభ్యమయ్యే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి. అదే విధంగా పలు రకాల అనారోగ్య సమస్యలు రాకుండా చెక్ పెడుతుంది సపోటా. కాబట్టి సపోటా కనబడితే ఖచ్చితంగా తినేందుకు ట్రై చేయండి. అదే విధంగా శీతా కాలంలో ఈ సపోటా తింటే ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రోజుకో సపోటా పండు తింటే.. కంటి సమస్యలు దూరం అవుతాయి. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కళ్లు చక్కగా కనిపించేందుకు కావాల్సిన పోషకాలు సపోటాలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తినండి.
సపోటా పండులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ముఖంపై ముడతలు, గీతలు వంటివి రానివ్వదు. చర్మం యంగ్‌గా, కాంతి వంతంగా కనిపిస్తుంది.
సపోటాలో విటమిన్ సి కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శీతా కాలంలో అనేక రకా వైరస్‌లు, బ్యాక్టీరియా, ఇన్ ఫెక్షన్లు రాకుండా రక్షణ కల్పిస్తుంది. రోగాలు, వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. నీరసం, అలసటతో బాధ పడేవారు ఇది తింటే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి వారు సపోటా తినడం వల్ల రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. నిద్ర సమస్యలు ఉన్నవారు సపోటా తింటే ఆ సమస్య నుంచి బయట పడొచ్చు.
ప్రస్తుతం చాలా మంది జీర్ణ సమస్యలు, మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారు సపోటా తింటే ఈ సమస్యల తగ్గుముఖం పడతాయి. సపోటాలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. దీని వల్ల తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. అదే విధంగా గ్యాస్, కడపులో నొప్పి వంటివి రాకుండా ఉంటాయి. అంతే కాకుండా బరువు తగ్గాలి అనుకున్న వారికి కూడా ఇది బెస్ట్ ఫ్రూట్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.