
వంటలకు రుచినిచ్చే మిరపకాయలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వాటిలో ఉండే విటమిన్ A, C వంటి పోషకాలు శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. అలాగే క్యాప్సైసిన్ అనే రసాయనం బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి మిరపకాయలు కేవలం కారం కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి.
ఎర్రగా ఉండే ఈ మిరపకాయలు వాటి స్పైసీనెస్ కోసం చాలా పాపులర్. కొంత మంది వాటిని డైరెక్ట్‌గా వంటల్లో వేస్తారు. మరికొందరు పౌడర్ లాగా వాడతారు. ఈ రెండింటిలోనూ ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తాయి.
అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఎర్ర మిరపకాయలు విటమిన్ Aకి ఒక రిచ్ సోర్స్. ఇది కంటి ఆరోగ్యానికి, బాడీలోని వివిధ ఆర్గాన్స్ ఫంక్షనింగ్‌కు చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. రోజూ ఒక చిన్న టీస్పూన్ మిరపకాయ పౌడర్ తీసుకోవడం వల్ల విటమిన్ A లోపాన్ని నివారించవచ్చు.
రీసెర్చ్ ప్రకారం.. ఎర్ర మిరపకాయల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ బాడీ సెల్స్‌ను ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి క్యాన్సర్, హార్ట్ డిసీజెస్ లాంటి సమస్యల రిస్క్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే నేచురల్ కెమికల్ వాటికి కారం రుచి ఇవ్వడమే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది.
ఈ విధంగా మిరపకాయలు కేవలం టేస్ట్‌కి మాత్రమే కాదు.. హెల్త్‌కు కూడా ఒక నేచురల్ మెడిసిన్ లాగా పనిచేస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)