Jowar Roti : చిరుధాన్యాల్లో ఒకటి జొన్నలు. రుచి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ జొన్నలను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాలోని 500 మినియన్ల ప్రజలు ఆహార ధాన్యంగా ఉపయోగిస్తున్నారు. ఈ జొన్నల్లో శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి సహాయం చేసే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్ ఆమ్లం వంటి అనేక సూక్ష్మపోషకాలు ఉన్నాయి. అందుకనే ఈ జొన్నలతో రొట్టెలనే కాదు.. పేలాల, పేలాలు లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి చేస్తారు. గోధుమలలో ఉ౦డే, గ్లూటెన్ అనే మృదువైన ప్రొటీన్ చాలామ౦దికి సరిపడట౦ లేదు. జొన్నల్లో గ్లూటెన్ ఉ౦డదు.అ౦దువలన ఈ ప్రత్యామ్నాయ ధాన్య౦గా జొన్నలపై ప్రప౦చ౦ తనదృష్టి సారి౦చి౦ది. దీంతో జొన్నలకు ప్రప౦చ వ్యాప్త౦గా డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరీ పరీవాహక ప్రా౦తాలలో జొన్న పంటను అధికంగా పండిస్తారు.
అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే జొన్నలను మన భారతదేశంలో ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తుంటారు. జోవార్, సొర్లుమ్, క్వినోవా అని పిలుస్తున్నారు. అయితే గతంలో జొన్న రొట్టెలు కొన్ని ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే తినేవారు. అయితే ఇటీవల కాలంలో జొన్న రొట్టెల వాడకం బాగా పెరిగింది. ఇంతకు ముందు చపాతీ మాత్రమే తినేవాళ్లలో చాలా మంది ఇప్పుడు జొన్న రొట్టెలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. జొన్నరొట్టెలు చాలా బలవర్ధకమైన అహారం. ఎముక పుష్టి కూడా ఉంటుంది. జొన్న రొట్టెలు, జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు సులభంగా అరగుతాయి. దాని వల్ల బరువు పెరగకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది. అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.