వామ్మో.. మనకే కాదు.. వాయు కాలుష్యంతో పుట్టబోయే బిడ్డ మెదడుపై కూడా ప్రభావం..

వాయు కాలుష్యం కేవలం పెద్దలకే కాదు, గర్భంలో ఉన్న శిశువుల మెదడుపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గర్భిణులు కాలుష్యానికి గురైనప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్, బ్లాక్ కార్బన్ వంటి కణాలు బిడ్డ మెదడు ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. ఐక్యూ తగ్గడం, ఆటిజం వంటి న్యూరో డెవలప్‌మెంటల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వామ్మో.. మనకే కాదు.. వాయు కాలుష్యంతో పుట్టబోయే బిడ్డ మెదడుపై కూడా ప్రభావం..
Air Pollution During Pregnancy

Edited By:

Updated on: Jan 03, 2026 | 1:26 PM

కరోనా తర్వాత భారతదేశానికి ఎదురవుతున్న అతిపెద్ద ప్రమాదం వాయు కాలుష్యం అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలే కాకుండా కళ్లు, గుండెతోపాటు మొత్తం శరీరానికి పెను ప్రమాదంగా మారుతుందని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రంగా వాయు కాలుష్యం మన భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఢిల్లీ ఆస్పత్రిలో 20 నుంచి 30% వరకు ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేషెంట్లే ఎక్కువగా ఉన్నారని లెక్కలు చెబుతుండటం.. దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

అయితే.. ఈ వాయు కాలుష్యం వల్ల భూమిపైన జీవిస్తున్న మనకే కాకుండా.. భూమిపై అడుగు పెట్టబోయే పుట్టబోయే బిడ్డ మెదడును కూడా దెబ్బతీస్తుందని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. గర్భంతో ఉన్న మహిళలు వాయు కాలుష్యానికి గురైనప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్, ఫైన్ పార్టీకులేట్ మేటర్ బ్లాక్ కార్బన్ వంటి కాలుష్యాలు గర్భంలో ఉన్న శిశువు మెదడుకు ప్రమాదంగా మారాయి. గర్భధారణ సమయంలో హెయిర్ పొల్యూషన్ బారిన మహిళలు పడడం వల్ల అభివృద్ధి చెందుతున్న శిశువు మెదడు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని లాండ్ సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం పేర్కొంది. రెండు లేదా మూడు నెలల ప్రెగ్నెన్సీ సమయంలో ఈ ప్రభావం అధికంగా ఉండవచ్చని తెలిపింది.

బార్సిలోనా లైఫ్ స్టడీ కోహట్ ఆధారంగా 754 గర్భిణీలపై వాయు కాలుష్య ప్రభావాలను పరిశోధకులు స్టడీ చేయగా స్పెషల్లైజ్డ్ అల్ట్రాసౌండ్ ద్వారా ఫీటల్ బ్రెయిన్ స్ట్రక్చర్లను విశ్లేషించారు. గర్భిణీ స్త్రీ వాయు కాలుష్యానికి గురైనప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్, ఫైన్ పార్టీక్యూలేట్ మ్యాటర్, బ్లాక్ కార్బన్ వంటి కాలుష్యాలు శిశువు మెదడుపై ప్రభావం చూపుతాయని వైద్యులు అంటున్నారు. గర్భిణీ స్త్రీ వాయు కాలుష్యం ప్రభావానికి గురైతే బిడ్డ మెదడు అభివృద్ధిపై ప్రభావంతో పాటు పుట్టిన తర్వాత ఐక్యూ లెవెల్ తగ్గే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. దీంతోపాటు ఆటిజం వంటి న్యూరో డెవలప్మెంటల్ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు డాక్టర్ జి.లతా ఎంబిబిఎస్, ఎండి..

వాయు కాలుష్యం వల్ల గర్భిణీ స్త్రీ ముందస్తు ప్రసవం అయ్యే ప్రమాదంతో పాటు ఆ సమయంలో పుట్టిన బిడ్డ మెదడు పూర్తిగా అభివృద్ధి కాకపోవడం.. అలాగే.. పలు అనారోగ్య సమస్యలు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తే.. కొంత బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..