చాలా మంది మద్యం తాగడానికి ఇష్టపడుతుంటారు. కొన్నిసార్లు ఎవరైనా మూడ్‌ని తేలికపరచడానికి లేదా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఇదే వ్యసనంగా మారడంలో కొంతమంది దానికి బానిసగా మారుతుంటారు. అయితే, దీని వ్యసనం ఆరోగ్యానికి, సామాజిక జీవితానికి చాలా చెడ్డది. మద్యం సేవించిన తర్వాత ఆహారంలో ఏం తినాలనే విషయంపై వారికి అవగాహన ఉండదు. దీని కారణంగా ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. మద్యం సేవించిన తర్వాత ఎలాంటి పదార్థాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకందాం..
నూనె పదార్థాలు అస్సలు తీసుకోవచ్చు..
తరచుగా ఆల్కహాల్ తీసుకునేప్పుడు నూనె పదార్థాలు తీసుకుంటుంటారు. ఆ సమయంలో తినడానికి రుచికరంగా అనిపించవచ్చు. కానీ, అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. జిడ్డు పదార్థాల వల్ల పొట్టలో గ్యాస్ సమస్య ఏర్పడి జీర్ణక్రియ సమస్య కూడా రావచ్చు. నూనె పదార్థాలు గుండెకు కూడా హానికరం.
తీపి పదార్థాలు, పాలను దరిచేరనివ్వొద్దు..
మద్యం సేవించిన తర్వాత స్వీట్లు, పాలు శరీరంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. పాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉండగా, పంచదార తినడం వల్ల మత్తు స్థాయి పెరిగి అపస్మారక స్థితికి వెళ్లవచ్చు. అందుకే ఆల్కహాల్ తాగిన తర్వాత ఏం తినాలి, ఏవి తినకూడదు అనే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
సోడా లేదా శీతల పానీయాలకు బదులుగా నీరు..
మద్యాన్ని ఇష్టపడే చాలా మంది సోడా లేదా శీతల పానీయాలలో కలుపుకుని తాగుతారు. దీని కారణంగా, ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీంతో అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల, దీన్ని దృష్టిలో ఉంచుకుని, వీలైతే, తక్కువ పరిమాణంలో, అది కూడా నీటితో తాగాలి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసమే. వీటిలో ఏవైనా పాటించాలని అనుకుంటే, తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.