Salt side effects: అంచుకు ఉప్పు వేసుకుంటున్నారా.? పరిశోధనల్లో తేలిన భయంకర విషయాలు..

|

Dec 09, 2022 | 7:47 AM

శరీరానికి సరిపడ ఉప్పు అందాలనే విషయం తెలిసిందే. అయితే ఉప్పులో శరీరానికి మేలు చేసే అయోడిన్‌ వంటి మంచి గుణాలు ఉన్నట్లే చెడు చేసేవి కూడా ఉన్నాయి. ఉప్పు మోతాదుకి మించి తీసుకుంటే ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

Salt side effects: అంచుకు ఉప్పు వేసుకుంటున్నారా.? పరిశోధనల్లో తేలిన భయంకర విషయాలు..
Salt Side Effects
Follow us on

శరీరానికి సరిపడ ఉప్పు అందాలనే విషయం తెలిసిందే. అయితే ఉప్పులో శరీరానికి మేలు చేసే అయోడిన్‌ వంటి మంచి గుణాలు ఉన్నట్లే చెడు చేసేవి కూడా ఉన్నాయి. ఉప్పు మోతాదుకి మించి తీసుకుంటే ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రక్తపోటు, గుండె జబ్బులకు ఉప్పు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మనలో చాలా మంది ఆహారంలో ప్లేటులో వడ్డించిన తర్వాత అంచుకు ఉప్పు జల్లుకుని తింటుంటారు. వంటకంలో ఎంత ఉప్పు ఉన్నా ఇంకొంచెం ఉప్పు వేసుకుంటారు. అయితే ఇలా అధికంగా ఉప్పు జల్లుకొని తినేవారిలో గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

యూకేలో సుమారు 12 ఏళ్ల పాటు 1,76,750 మంది పేషెంట్ల ఆహారపు అలవాట్లను, ఆరోగ్య సమస్యలను పరిశీలించిన తర్వాత ఈ నిర్దారణకు వచ్చారు. అదనంగా ఉప్పు వేసుకునే అలవాటు ఉన్న 7 వేల మందికి గుండెపోటు రాగా, 2 వేల మంది పక్షవాతం బారిన పడ్డారు. అదనంగా ఉప్పు వేసుకోనివారిలో హృద్రోగ సమస్యలు తక్కువగా ఉండడం గమనించినట్లు న్యూ ఆర్లీన్స్‌ కు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ లు చీ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు.

అయితే ప్రస్తుతం మన జీవనశైలి, అహారపు అలవాట్ల ఆధారంగా రోజుకు సగటున 10 గ్రాముల ఉప్పు శరీరంలోకి చేరుతోందని అంచనా. అయితే రక్తపోటు భయం కారణంగా ఉప్పు మరీ తగ్గించడం కూడా మంచిది కాదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఉప్పును మొత్తం మానేయడం కాకుండా మితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉప్పులో ఉండే సోడియం శరీరంలోని ద్రవాలను సమతూకంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి, అలాగే సోడియం స్థాయిలు పెరిగితే రక్తనాళాల్లోకి ద్రవాలు ఎక్కువగా చేరడంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..