Apricot Benefits : వయసుతో వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టె ఆప్రికాట్.. ఈ పండు తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే వదులుగా..!

|

Mar 15, 2021 | 5:54 PM

ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రకృతి మనకు అనేక పండ్లను, కూరగాయలను ఇచ్చింది. ఆయా కాలాల్లో పండే సీజనల్ ఫ్రూట్స్ ఎంతో మంచివి. ఆరోగ్యాన్ని అందించే పండ్లలో ఒకటి ఆప్రికాట్. దీనిని సీమ బాదం అని కూడా..

Apricot  Benefits : వయసుతో వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టె ఆప్రికాట్.. ఈ పండు తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే వదులుగా..!
Apricot Benefits
Follow us on

Apricot Benefits :  ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రకృతి మనకు అనేక పండ్లను, కూరగాయలను ఇచ్చింది. ఆయా కాలాల్లో పండే సీజనల్ ఫ్రూట్స్ ఎంతో మంచివి. ఆరోగ్యాన్ని అందించే పండ్లలో ఒకటి ఆప్రికాట్. దీనిని సీమ బాదం అని కూడా అంటారు. ఇది తీపి, వగరు టెస్టులతో భిన్నంగా ఉంటుంది. అయితే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అత్యధికంగా ఇస్తుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, , విటమిన్ ఎ, ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఖుర్భాని అని కూడా ఈ పండును పిలుస్తారు.. ఈరోజు ఆప్రికాట్ తిండడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!

* ఆప్రికాట్ లో పీచు పదార్ధం పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అంతే కాదు, క్రమం తప్పకుండా పేగులను శుభ్రపరుస్తుంది. ప్రేవుల్లో ఏర్పడే సమస్యలనుంచి రక్షిస్తుంది. ఆంటీకాదు మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను దరి చేరనీయదు.

*ఆప్రికాట్లు కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంధత్వాన్ని త్వరగా రానీయదు. ఈ పండులో కంటిచూపును కాపాడే కెరోటినాయిడ్లు, శాంతోఫిల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో వయసు రీత్యా వచ్చే కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలుస్తోంది.

*ఆప్రికాట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాదు ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో బరువు తగ్గవచ్చు. ఫైబర్ కొవ్వును తగ్గిస్తుంది. కొన్ని రకాలైన గుండె సంబంధిత వ్యాధులను, గుండె పోటును నివారిస్తుంది.

* ఇక దీనిలో అధికంగా ఐరెన్ ఉండడం వల్ల ఈ పండు తిన్నవారికి రక్తహీనత దరిచేరదు. అంతేకాదు రక్తంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది

* దీనిలో పిండి పదార్ధాలు అతి తక్కువగా ఉండడంతో మధుమేహ బాధితులు ఈ పండును అధికమొత్తంలో తినవచ్చు.
* ఆప్రికాట్లలో బీటా-క్రిప్టోక్సంతిన్ అనే రసాయనం అధికంగా ఉంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ సమస్య వల్ల కలిగే నొప్పిని నివారించగలదని ఆర్థరైటిస్ ఫౌండేషన్ యొక్క నివేదిక ప్రకారం తెలుస్తోంది.

*ఆప్రికాట్ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ఫ్యటీ లివర్ వ్యాధి నుంచి బయటపడేలా చేస్తుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

* ఉబ్బసం, జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్నవారు ఆప్రికాట్ తినడం వల్ల వాటి నుంచి ఉపశమనం కలుగుతుందని కొన్ని పరిశోధనలద్వారా తెలిసింది.
*ఈ పండులో అధికంగా విటమిన్ ఇ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Also Read:

పెరుగుతున్న కరోనా యాక్టివ్‌ కేసులు.. గత 24గంటల్లో ఎంతమంది కోలుకున్నారంటే..?

విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘పుష్పక విమానం’’ ఫస్ట్ సాంగ్