తమకు ఒత్తైన జట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. దాని కోసం స్త్రీ, పురుషబేధం లేకుండా అందరూ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు కూడా. కానీ మారుతున్న వాతావరణం, జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు కూడా తలెత్తుతాయి. చుండ్రు మాత్రమే కాకుండా, జుట్టు రాలడం కూడా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రజల్లో బట్టతల సమస్య కూడా బాగా ఎక్కువైంది. జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి..?. జుట్టు రాలడం చికిత్స, నివారణలు మరియు జుట్టు మార్పిడి వరకు అనేక ప్రయత్నాలు చేయాలనుకుంటారు. కానీ డైట్‌పై శ్రద్ధ పెట్టకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం ప్రయోజనం. జుట్టు రాలడాన్ని నివారించడం కోసం కొన్ని రకాల డైట్‌లను పాటిస్తే సరి.. జట్టు విషయంలో మీ టెన్షన్ పూర్తిగా దూరమవుతుంది.
ప్రొటీన్- జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్, బయోటిన్ చాలా ముఖ్యమైనవి. ఈ రెండు మూలకాలు జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా వాటి పెరుగుదలకు కూడా సహాయపడతాయి. గుడ్లలో ఈ రెండు మూలకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మీ ఆహారంలో గుడ్లను ఖచ్చితంగా చేర్చుకోండి. , గుడ్లలో ప్రొటీన్‌తో పాటు జింక్, సెలీనియం కూడా ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా ముఖ్యమైనవి. బయోటిన్ కెరాటిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఒక రకమైన జుట్టు ప్రోటీన్.
బచ్చలికూర- బచ్చలికూరలో విటమిన్ ఎ, సి, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహకరించడమే కాక జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఎ చర్మ గ్రంథిలోని సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెబమ్ స్కాల్ప్‌ను మాయిశ్చరైజ్ చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
క్యారెట్, చిలగడదుంపలు- క్యారెట్, చిలగడదుంపలు కూడా జుట్టు రాలడాన్ని ఆపుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఎ జుట్టు పెరుగుదలకు తోడ్పడటంతో పాటు వాటిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
ఓట్స్- ఇప్పటి వరకు మీరు ఓట్స్‌ను బరువు తగ్గించే వంటకంగా మాత్రమే ఉపయోగించారు. అయితే ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. వోట్స్‌లో జింక్, ఐరన్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి జుట్టును ఒత్తుగా పెంచడంతో పాటు వాటిని పొడవుగా, మందంగా మార్చడంలో కూడా సహాయపడతాయి.
వాల్‌నట్- వాల్‌నట్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా జుట్టుకు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో బయోటిన్, విటమిన్లు B1, B6 మరియు B9, E, మెగ్నీషియం ఇంకా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడే ప్రొటీన్లు ఉంటాయి.
జుట్టు రాలడానికి కారణాలు:
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి