Health Tips: రోడ్ల పక్కన దొరుకుతుంది చిన్నచూపు వద్దు.. ఈ ఆకుతో ఆ సమస్యలన్నీ పరార్

Moringa Leaves: మునగ ఆకులో ఐసోథియోసైనేట్‌లు ఉంటాయి. ఇవి శరీరంలో పలు చోట్ల వచ్చే వాపు, నొప్పి లాంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే దీంట్లోని విటమిన్-సి, జీటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, కెంప్‌ఫెరోల్ వంటి ముఖ్యమైన పోషకాలు నిండిన రోగనిరోధక శక్తిని బలపరిచి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మునగాకు వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏం ఉన్నాయో తెలుసుకుందాం పదండి...

Health Tips: రోడ్ల పక్కన దొరుకుతుంది చిన్నచూపు వద్దు.. ఈ ఆకుతో ఆ సమస్యలన్నీ పరార్
Moringa Leaves

Updated on: May 30, 2024 | 5:49 PM

మన జీవన విధానమే మనల్ని కాపాడుతుంది అని ఆయుర్వేదం చెబుతుంది. సమయానికి తినడం, సమయానికి పడుకోవడం, కాస్త వ్యాయామం మనల్ని అనారోగ్యానికి దూరంగా ఉంచుతాయి. ఇక మన ఇళ్ల పక్కన దొరికే.. రకరకాల ఆకులు.. చాలా రకాల రోగాలను తరిమి కొట్టేందుకు ఉపయోగపడతాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మునగాకు గురించింది. మునగాకు బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచుంది. ఎముకలను బలవర్థంగా మార్చుతుంది. తిన్న ఫుడమ్ మంచిగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా మునగాకు వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

మునగాకులో బీటాకెరొటిన్‌ బాగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.

ఈ ఆకుల నుంచి  ఐరన్ దండిగా లభిస్తుంది. పప్పు, కూర,  వేపుడు, పొడి… ఇలా వివిధ రకాలుగా మునగాకును ఆహారంలో చేర్చుకుంటే ఎనీమియా సమస్యను తరిమికొట్టొచ్చు

పాలతో పోలిస్తే మూడొంతుల క్యాల్షియం మునగాకులో ఉంటుంది. 100 గ్రాముల మునగాకు నుంచి దాదాపు నాలుగు వందల మైక్రోగ్రాముల క్యాల్షియం శరీరానికి అందుతుంది. దీన్ని పొడిలా, కూరల్లో వేసుకుని తీసుకుంటే ఎముక సంబంధ సమస్యలు రావు.

మునగాకులోని కొన్ని రసాయనాలు రక్తనాళాలు గట్టిగా మారకుండా పనిచేస్తాయి. వీటిలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను తగ్గించే గుణం ఉంటుంది

దీనిలోని పీచు తిన్న ఫుడ్ త్వరగా జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తుంది. కాబట్టి ఊబకాయులు తమ డైట్‌లో దీన్ని చేర్చుకోవచ్చు.

ఈ ఆకుల్లో విటమిన్‌-సి కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే రోగనిరోధక శక్తి  పెరుగుతుంది.

వీటిలోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది. పీచు రక్తస్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారు ఈ ఆకులను తరచూ తీసుకుంటే సమస్యను ఎదుర్కొనవచ్చు.

మునగలోని ఫైటోకెమికల్స్‌, పాలీఫినాల్స్‌ శరీరంలోని మలినాలను  తరిమికొట్టి.. రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి.

దెబ్బతిన్న కాలేయ కణాలను సరిచేయడానికి, ఆక్సీకరణ స్థాయిలను తగ్గించడానికి, ప్రోటీన్ స్థాయిలను మెరుగుపరచడానికి మునగ ఆకు మీకు చక్కగా ఉపయోగపడుతుంది.