Health Tips: తియ్యనైన రుచి మాత్రమే కాదు.. ఖర్జూరంతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..

|

Feb 27, 2022 | 2:58 PM

ఖర్జూరం.. ఆహా ఆ పండ్లను చూడగానే నోటిలో నీళ్లూరుతాయి. ఖర్జూరం పంచదారలా ఎంతో తియ్యగా రుచిగా ఉంటుంది. అయితే నోటికి మంచిగా అనిపించేవి.. ఒంటికి మంచివి కాదు అంటారు పెద్దలు. కానీ..

Health Tips: తియ్యనైన రుచి మాత్రమే కాదు.. ఖర్జూరంతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..
Benefits Of Dates
Follow us on

Health Benefits of Dates: ఖర్జూరం.. ఆహా ఆ పండ్లను చూడగానే నోటిలో నీళ్లూరుతాయి. ఖర్జూరం పంచదారలా ఎంతో తియ్యగా రుచిగా ఉంటుంది. అయితే నోటికి మంచిగా అనిపించేవి.. ఒంటికి మంచివి కాదు అంటారు పెద్దలు. కానీ ఖర్జూరం విషయంలో మాత్రం ఇది తప్పని చెప్పాలి. ఇది ఆరోగ్యదాయిని కూడా. ఖర్జూరంలోని ఫ్రక్టోజ్‌, డెక్స్‌ట్రోజ్‌ వంటి సరళ పిండి పదార్థాలు తిన్న వెంటనే శక్తిని ఇస్తాయి. ఖర్జూరంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ పెంపొందించడమే కాకుండా.. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే టానిన్లనే యాంటీఆక్సిడెంట్లు ఇన్‌ఫెక్షన్లు, వాపు, రక్తస్రావ నివారణకు తోడ్పడతాయి. ఎండిన ఖర్జూర పండ్ల వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ఖర్జూర పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.

  1. ఖర్జూర పండ్లలో ఉండే విటమిన్-ఏ, బి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి
  2. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటి సమస్యలకు ఖర్జూరం గుజ్జు మంచి మెడిసిన్
  3. ఖర్జూరంలో ఉండే బీటా కెరటిన్‌, ల్యుటీన్‌, జియాగ్జాంతిన్‌ అనే రుచికారక యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌‌ను అడ్డుకుంటాయి. ఇలా పెద్దపేగు, ప్రోస్టేట్‌, రొమ్ము, ఎండోమెట్రియల్‌, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ ఇస్తాయి.
  4. జియాగ్జాంతిన్‌ వృద్ధాప్యంలో రెటీనాలోని మాక్యులా క్షీణించకుండానూ కాపాడుతుంది.
  5. కణాలకు పొటాషియం చాలా అవసరం. ఇది ఖర్జూరంలో సరిపడినంత ఉంటుంది.
  6. ఒంట్లో ద్రవాలు, గుండెలయ, రక్తపోటు నియంత్రణలోనూ పొటాషియం పాలు పంచుకుంటుంది. ఇలా గుండె, మెదడు వంటి కీలక అవయవాలకూ ఖర్జూరం మేలు చేస్తుంది.
  7. ఐరన్ లోపంతో బాధపడే వారికి ఖర్జూరం చాలామంచిది.
  8. మలబద్దకం వేదిస్తుంటే పాలల్లో కొన్ని ఎండు ఖర్జూరాలను వేసి మరగబెట్టి నిద్రపోయే ముందు తాగితే మంచిది.
  9. ఖర్జూరంలో ఉండే సెలీనియం, మెగ్నీషియం, కాపర్, మెగ్నీషియం ఓస్టిరియో ఫోసిస్ నివారిస్తాయి.
  10. ఖర్జూరంలో ఫంగస్‌, బ్యాక్టీరియా, వైరస్‌ను ఎదుర్కొనే గుణాలూ ఉన్నాయి. పీచు, ఫెనాల్‌ తరగతి ఆమ్లాలు సైతం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుండెజబ్బుల నివారణకు, రోగనిరోధకశక్తి సక్రమంగా పనిచేయటానికీ ఖర్జూరం సాయపడుతుంది

 డయాబెటీస్, గుండె,  ఇతరాత్ర వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా వైద్యుల సూచన తర్వాతే ఖర్జూర పండ్లను తీసుకోవాలి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచిది.

Also Read: గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు ఇవే.. ఈ సమయాల్లో జాగ్రత్త

అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?