14 ఏళ్లకే తల్లైంది.. పుట్టిన బిడ్డను ఫ్రీజరులో పెట్టింది

పద్నాలుగేళ్లకే ఆ బాలిక గర్భం దాల్చింది. పురిటి నొప్పులు రావడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో శిశువుకు జన్మనిచ్చింది. చేసిన పాపం ఎవరికి చెప్పకుండా నవజాత శిశువును ఫ్రీజరులో దాచిన దారుణ ఘటన రష్యా దేశంలో వెలుగుచూసింది.

  • Balaraju Goud
  • Publish Date - 12:15 pm, Fri, 30 October 20

పద్నాలుగేళ్లకే ఆ బాలిక గర్భం దాల్చింది. పురిటి నొప్పులు రావడంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో శిశువుకు జన్మనిచ్చింది. చేసిన పాపం ఎవరికి చెప్పకుండా నవజాత శిశువును ఫ్రీజరులో దాచిన దారుణ ఘటన రష్యా దేశంలో వెలుగుచూసింది.

రష్యాలోని సైబీరియా ప్రాంత నోవోసిబిర్కుస్ నగరానికి సమీపంలోని వర్ద్ తులా గ్రామానికి చెందిన 14 ఏళ్ల పాఠశాల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఇంట్లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తనకు ప్రసవించిన బిడ్డ గురించి తల్లిదండ్రులకు, కుటుంబసభ్యలకు చెప్పేందుకు భయపడింది. అప్పుడే పుట్టిన శిశువును ప్లాస్టిక్ కవర్ లో ఉంచి ఆమె తండ్రి తోట పనిలో ఉన్నపుడు గ్యారేజీ ఫ్రీజరులో దాచింది.

బాలిక ప్రసవించిన తర్వాత రక్తస్రావం చూసి ఆమె తల్లి కూతురును నిలదీసింది. దీంతో అపెండిసైటిస్ తో బాధపడుతుందని అంబులెన్సను ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చేరిన బాలికను పరీక్షించిన వైద్యులు డెలివరీ అయ్యినట్లు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం వెల్లడించింది బాలిక. తనకు జన్మించిన నవజాత శిశువును ఫ్రీజరులో ఉంచానని చెప్పడంతో వెళ్లి చూడగా ఆ శిశువు మరణించి ఉంది. బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.