బిగ్ బ్రేకింగ్: విశాఖలో ఎదురుకాల్పులు.. 5గురు మావోయిస్టులు మృతి
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో గుమ్మిరేవులలో మావోయిస్టుల సంచారం ఉందని కూంబింగ్ దళాలకు సమాచారం అందింది. ఈ […]

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో తుపాకుల మోత మోగింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో గుమ్మిరేవులలో మావోయిస్టుల సంచారం ఉందని కూంబింగ్ దళాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం. మృతులు ఎంతమంది? వారెవరు?