
భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన కాసాగ్రాండ్, హైదరాబాద్లోని మెడ్చల్ ప్రాంతంలో ‘కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్’ పేరుతో ఒక అతి ప్రీమియం గేటెడ్ విల్లా కమ్యూనిటీని అధికారికంగా ప్రారంభించింది. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతున్న ఈ ప్రత్యేక ప్రాజెక్ట్లో మొత్తం 130 అత్యున్నత స్థాయి 5 BHK విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విల్లాల ప్రారంభ ధర రూ. 2.99 కోట్ల నుండి ప్రారంభమవుతుంది. అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ విల్లాలు విశాలమైన నివాస విస్తీర్ణంతో పాటు ప్రైవేట్ హోమ్ థియేటర్ ఏర్పాటు చేసే సదుపాయం, ప్రత్యేక లిఫ్ట్ ప్రొవిజన్, విస్తృత ల్యాండ్స్కేప్ గార్డెన్, 1,200 చదరపు అడుగుల వరకు వ్యక్తిగత తోట స్థలం మరియు సుమారు 375 చదరపు అడుగుల బ్యాక్యార్డ్ ప్రదేశాన్ని కలిగి ఉంటాయి. ప్రతి విల్లా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో రూపొందించబడింది.
ఈ ప్రాజెక్ట్లో 55కి పైగా ఇండోర్, అవుట్డోర్ లైఫ్స్టైల్ సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న G+3 క్లబ్హౌస్, రూఫ్టాప్ స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, యోగా స్టూడియో, పిల్లల ఆట స్థలాలు, మల్టీపర్పస్ కోర్టులు, వాకింగ్ ట్రాక్లు, సీనియర్ సిటిజన్ జోన్, రిఫ్లెక్సాలజీ వాక్వే వంటి అనేక సౌకర్యాలు నివాసితులకు ఆరోగ్యకరమైన, సమతుల్య జీవనశైలిని అందించడానికి రూపుదిద్దుకున్నాయి.
ప్రకృతి మధ్య ప్రశాంతమైన ప్రైవేట్ స్పేస్
మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణంలో సుమారు 67% భాగాన్ని ఓపెన్ స్పేస్, ల్యాండ్స్కేపింగ్కు కేటాయించడం ద్వారా ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించారు. ఫెంగ్ షుయ్ ప్రేరణతో రూపొందించిన ఉద్యానవనాలు, ప్రత్యేక థీమ్ గార్డెన్లు, విస్తృత హరిత ప్రదేశాలు నివాసితులకు ప్రశాంతత, ప్రైవసీని కల్పిస్తాయి
ప్రతి విల్లాకు 100% పవర్ బ్యాకప్
ఇంటీరియర్ రూపకల్పనలో 9’10” ఎత్తైన సీలింగ్లు, విస్తృత గాజు స్లైడింగ్ తలుపులు, సమృద్ధిగా సహజ కాంతి, గాలి ప్రసరణకు అనుకూలమైన ప్రణాళిక, వాక్-ఇన్ వార్డ్రోబ్లతో కూడిన సూట్-సైజ్ బెడ్రూమ్లు, విశాలమైన మాడ్యులర్ వంటగదులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విల్లాకు 100% పవర్ బ్యాకప్ సదుపాయం కల్పించబడింది
అన్నింటికి అందుబాటులో
మేడ్చల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం వలన హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఐటి కారిడార్లు, పరిశ్రమల కేంద్రాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సేవా సంస్థలు, వినోద ప్రదేశాలకు సులభంగా చేరుకునే అవకాశం కల్పిస్తుంది. మేడ్చల్ ఇండస్ట్రియల్ కారిడార్, జీనోమ్ వ్యాలీ, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఇతర అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటం దీని విలువను మరింత పెంచుతుంది.
అదనంగా, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సౌకర్యవంతమైన కనెక్టివిటీ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత బలపరుస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా కూడా ఇది అత్యుత్తమ అవకాశంగా భావించబడుతోంది. ఈ ప్రాజెక్ట్ TS RERA – RERA No: P02200010193 కింద నమోదు చేయబడింది. మరిన్ని వివరాల కోసం: www.casagrand.co.in. సంప్రదించండి.
కాసాగ్రాండ్ ప్రత్యేకత
CBRE నివేదికల ప్రకారం.. కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ లిమిటెడ్ చెన్నైలో అతిపెద్ద రెసిడెన్షియల్ డెవలపర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 2017 జనవరి 1 నుండి 2025 జూన్ 30 వరకు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభాల్లో సుమారు 25% మార్కెట్ వాటా, మొత్తం గృహ డిమాండ్లో సుమారు 18% వాటాను సాధించింది.
చెన్నైలో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ 21.79 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 103 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. 2025 జూన్ 30 నాటికి, 44.10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 57 ప్రాజెక్టులు అమలులో ఉండగా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, దుబాయ్ నగరాలలో 23.81 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 21 రాబోయే ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. కాసాగ్రాండ్ బ్రాండ్ కింద, సంస్థ ప్రీమియం, మధ్యస్థ, విలువ ఆధారిత గృహ విభాగాలలో అపార్ట్మెంట్లు, విల్లాలను అందిస్తోంది.