Tandav Absolutely Brilliant: తాండవ్ తారాగణంతో పనిచేయడం చాలా సంతోషం కలిగించింది : నటి కృతిక కమ్ర

జనవరి 15 నుంచి అమెజాన్ లో ప్రారంభం కానున్న తాండవ్ గురించి.. అందులో నటించిన నటీనటుల గురించి నటి కృతిక కమ్రా పంచుకుంది. 'తాండవ్' పనిచేసిన నటీనటులు చాలా అనుభవం కలవారని.. మంచి నటులని వారితో..

Tandav Absolutely Brilliant: తాండవ్ తారాగణంతో పనిచేయడం చాలా సంతోషం కలిగించింది : నటి కృతిక కమ్ర

Updated on: Jan 13, 2021 | 4:52 PM

Tandav Absolutely Brilliant:  తాండవ్  వెబ్ సిరీస్ గురించి.. అందులో నటించిన నటీనటుల గురించి నటి కృతిక కమ్ర పంచుకుంది. ‘తాండవ్’ పనిచేసిన నటీనటులు చాలా అనుభవం కలవారని.. మంచి నటులని వారితో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పింది. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ లో కలిసి పనిచేసిన నటుల్లో కొంత మంది తనకు ముందునుంచే స్నేహితులని.. మరికొందరు తాండవ్ షూటింగ్ సమయంలో పరిచయం అయ్యారని.. సంతోషం వ్యక్తం చేసింది.
బాలీవుడ్‌ అగ్రనటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘తాండవ్‌’ ట్రైలర్‌ ఇప్పటికే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పొలిటికల్‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం అలి అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కంది. డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌అయూబ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జనవరి 15 నుంచి అమెజాన్‌లో ప్రసారం కానుంది. రాజకీయాలే ప్రధానాంశంగా వస్తున్న ఈ సిరీస్‌ 9 భాగాలుగా ఉంటుంది.

Also Read: అందం అంటే తెలుపు కాదు.. నా రంగంటే నాకు ఇష్టం అంటున్న సుడాన్ సుందరి.. క్వీన్ ఆఫ్ ది బ్లాక్