మేడమ్ టుస్సాడ్స్‌లో టాలీవుడ్ చందమామ.. వీక్షించి మురిసిపోయిన భర్త గౌతమ్ కిచ్లు.. ఈ సందర్భంగా ఏం చెప్పాడంటే..
Kajal Aggarwal: లక్ష్మీ కల్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ తెలుగులో మాత్రమే కాదు.. తమిళం, హిందీ
Kajal Aggarwal: లక్ష్మీ కల్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ తెలుగులో మాత్రమే కాదు.. తమిళం, హిందీ వంటి భాషల్లోనూ అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సాధించింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పన్నెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ తన టాప్ స్థానాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది.
అయితే ఎంతో కాలంగా కాజల్ అగర్వాల్ అభిమానులు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. తెలుగు తెర అందాల చందమామ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరింది. ఇటీవల కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే భార్య మైనపు బొమ్మను ముందుగానే చూడటానికి ఆరాటపడిన కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ఒక్క రోజు ముందుగానే సింగపూర్‌కు బయలుదేరి టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు బొమ్మను చూసి మురిసిపోయాడు. తర్వాత రోజు అఫిషియల్‌గా కాజల్ మైనపు బొమ్మను టుస్సాడ్ మ్యూజియం వారు ప్రదర్శించగా ఆరోజు మాత్రం గౌతమ్ కిచ్లు బిజినెస్ పని మీద జర్మనీకి వెళ్లాడు. అయితే ఇప్పుడు కాజల్, ఆమె మైనపు విగ్రహాలతో కలిసి గౌతమ్ కిచ్లు దిగిన ఫొటోని షేర్ చేసింది . ఇందులో గౌతమ్ తన భార్య ఎవరు అన్నట్టుగా ఫేస్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి దక్షణాది కథానాయికగా పేరు సాధించింది కాజల్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, డార్లింగ్ ప్రభాస్ సరసన చందమామ విగ్రహం కూడా చేరడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ, దాన్ని తెలుగులోకి మేము తీసుకురావడం గర్వంగా ఉంది : అల్లు అర్జున్