సాయి ధరమ్‌కు విడుదల తేది కలిసొస్తుందా..!

వరుస పరాజయాలతో ఢీలాపడ్డ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రం ‘చిత్రలహరి’పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి ఎలాగైనా మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఏప్రిల్ 12న ఈ చిత్రానికి విడుదల తేదిని ఖరారు చేయగా.. అన్నీకలిసొస్తే ధరమ్‌కు ఈ చిత్రం బూస్టప్ ఇస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఏప్రిల్ 11న ఏపీ, తెలంగాణలో ఎన్నికలు ముగియనున్నాయి. అదే రోజు నుంచి పాఠశాలలకు సెలవులు రానున్నాయి. దీంతో ఈ […]

సాయి ధరమ్‌కు విడుదల తేది కలిసొస్తుందా..!

Edited By:

Updated on: Mar 15, 2019 | 10:55 AM

వరుస పరాజయాలతో ఢీలాపడ్డ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రం ‘చిత్రలహరి’పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి ఎలాగైనా మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఏప్రిల్ 12న ఈ చిత్రానికి విడుదల తేదిని ఖరారు చేయగా.. అన్నీకలిసొస్తే ధరమ్‌కు ఈ చిత్రం బూస్టప్ ఇస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఏప్రిల్ 11న ఏపీ, తెలంగాణలో ఎన్నికలు ముగియనున్నాయి. అదే రోజు నుంచి పాఠశాలలకు సెలవులు రానున్నాయి. దీంతో ఈ మరుసటి రోజు విడుదలకానున్న చిత్రలహరికి మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడుదల తరువాత కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అటూ ఇటూ అయినా కలెక్షన్లు కాస్త ఊరటను ఇవ్వగలవు. మరి ధరమ్ లక్ ఎలా ఉందో తెలియాలంటే ఏప్రిల్ 12వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఎలక్షన్ ఎఫెక్ట్ మజిలీ చిత్రంపై పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.