మరో ఏడాది.. రాజమౌళి మాట నిలుపుకుంటాడా..!

| Edited By: Srinu

Jul 03, 2019 | 4:30 PM

‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచి అందరిలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ కోసం అభిమానులు ఆసక్తినిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో అందరినీ ఓ ప్రశ్న తొలుస్తోంది అదేంటంటే.. ఆర్ఆర్ఆర్ గురించి నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో ఈ సినిమా […]

మరో ఏడాది.. రాజమౌళి మాట నిలుపుకుంటాడా..!
Follow us on

‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచి అందరిలోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ కోసం అభిమానులు ఆసక్తినిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో అందరినీ ఓ ప్రశ్న తొలుస్తోంది అదేంటంటే..

ఆర్ఆర్ఆర్ గురించి నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించాడు నిర్మాత దానయ్య. 2020,జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఆయన అధికారికంగా ప్రకటించాడు. ఇప్పుడు ఈ సమయానికి మరో ఏడాది సమయం ఉంది. అంటే ఈ లోపు షూటింగ్‌, గ్రాఫిక్స్ పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులు కంప్లీట్ అవ్వాలి. అయితే ఏ సినిమా విషయంలోనైనా పర్‌ఫెక్షన్ చూసే రాజమౌళి మేకింగ్‌కే కొన్ని నెలల సమయం తీసుకుంటాడు. ఇలాంటి సమయంలో ఆర్ఆర్ఆర్ అనుకున్న సమయానికి వస్తుందా..? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

 

ఇదిలా ఉంటే సెట్స్‌పైకి వెళ్లిన తరువాత మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఇక రెండో షెడ్యూల్‌ సమయంలో చెర్రీ కాలికి గాయం అవ్వడం, ఆ తరువాత ఎన్టీఆర్‌ గాయపడటంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇటీవలే తిరిగి ప్రారంభించారు. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి ఎడ్గర్ జోన్స్ తప్పుకోగా.. ఆ స్థానంలో మరో భామను ఇంకా రీప్లేస్ చేయలేదు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో జరుగుతున్న జాప్యం చూసి సినిమా కచ్చితంగా వాయిదా పడుతుందని అంచనా వేస్తున్నారు.

కాగా నిర్మాత దానయ్య మాత్రం.. డేట్ మారే ప్రసక్తి లేదని అంటున్నాడు. అన్నీ అనుకున్నట్లే జరుగుతాయని.. చిన్న చిన్న మార్పులు తప్ప షెడ్యూల్స్ అన్నీ పక్కాగా వెళ్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా విషయంలో రాజమౌళి ఏ మాత్రం మాటను నిలుపుకుంటాడో చూడాలి.