Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 ‘నర్మద’ ఎవరో తెలిసిపోయింది.. ఆమె మోనల్‌ను మించిపోతుందా.?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పదేళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఈ షో కోసం...

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 నర్మద ఎవరో తెలిసిపోయింది.. ఆమె మోనల్‌ను మించిపోతుందా.?

Updated on: Sep 06, 2021 | 5:06 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పదేళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ఈ షో కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. సినిమాల్లో కనిపించే సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారు.? వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలోనూ ఉంటుంది. అందుకే ఈ రియాలిటీ షోకు ఇంత క్రేజ్‌ వచ్చింది. ఇక బిగ్‌బాస్‌ కార్యక్రమం ఒక భావోద్వేగాల సమ్మేళనం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే ఇంటిలో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండడంతో కంటెస్టెంట్ల మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుంది. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా భావోద్వేగం చెందుతుంటారు. ఈ క్రమంలోనే హౌజ్‌ మేట్స్‌ ఏడిచే సందర్భాలు మనం తరుచూ చూస్తూనే ఉంటాం.

గత సీజన్‌లో మోనల్‌ గజ్జర్‌ ఎప్పుడూ ఏడుస్తూ కనిపించేంది. ఈ కారణంగానే ఆమెకు నెటిజన్లు ‘నర్మద’ అని పేరు కూడా పెట్టారు. అంటే మోనల్‌ కంటి నుంచి నీరు నర్మదా నదిలా ప్రవహిస్తుందని ఫన్నీగా కామెంట్లు చేశారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ మొదలైన విషయం తెలిసిందే. కంటెస్టెంట్‌లు ఇప్పటికే హౌజ్‌లో ఒకరోజు గడిపేశారు. ఇక బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లు సైతం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇందులో భాగంగానే తమకు నచ్చని కంటెస్టెంట్‌ల ఫొటోలను చెత్తలో పడమేయని బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చారు.

ఈ సమయంలోనే పలువురు హౌజ్‌మేట్స్‌ భావోద్వేగానికి గురయ్యారు. వీరిలో ఎక్కువగా ఎమోషనల్‌ అయిన వారిలో హమీదా మొదటి స్థానంలో ఉంది. ఏదో సందర్భంలో తీవ్ర ఎమోషన్‌కు గురైన హమీదా కంటతడి పెట్టుకుంది. దీంతో ఈసారి మోనల్‌ స్థానాన్ని హమీదా రీప్లేస్‌ చేస్తుందా.? అని అప్పుడు టాక్‌ మొదలైంది. నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని కామెంట్ల రూపంలో చెబుతున్నారు. మరి హమీదా.. నిజంగానే మోనల్‌ను మించిపోతుందా.? బిగ్‌బాస్‌ హౌజ్‌లో కన్నీరు ఏరులై పారుతుందో తెలియాలంటే ఎపిసోడ్‌లు గడుస్తోన్నా కొద్దీ తెలుస్తుంది.

Also Read: Suma Kanakala: చీరకట్టులో మెరిసిన తెలుగింటి ఆడపడుచు.. వైరలవుతున్న యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటోలు..

Poorna New Photos: తనదైన అందంతో కుర్రాళ్లను ఎట్ట్రాక్ట్ చేస్తున్న పూర్ణ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..

Bigg Boss 5: ‘అరే ఏంట్రా ఇది’.. హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. యాంకర్ రవి, షణ్ముఖ్‌‌లే టార్గెట్.!