Prabhas AdiPurush: ఆ పాత్రకు ఎవరు సెట్ అవుతారు!

రెబల్‌స్టార్ ప్రభాస్ నటించబోతున్న మొట్టమొదటి పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కబోతున్న

Prabhas AdiPurush: ఆ పాత్రకు ఎవరు సెట్ అవుతారు!

Edited By:

Updated on: Sep 05, 2020 | 5:51 PM

Prabhas Adipurush Movie: రెబల్‌స్టార్ ప్రభాస్ నటించబోతున్న మొట్టమొదటి పౌరాణిక చిత్రం ఆదిపురుష్‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మూవీకి బాలీవుడ్‌ దర్శకుడు ఓమ్‌ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3డీలో భారీ బడ్జెట్‌తో ఆది పురుష్‌ని  నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా ఖరారు అయ్యారు. ఇక సీత పాత్రకు కీర్తి సురేష్‌, కియారా అద్వాణీ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రాముడి పుట్టుక నుంచి రావణాసుర వధ వరకు ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుండగా.. అందులో లక్ష్మణుడు, హనుమంతుడు పాత్రలు కూడా చాలా కీలకమైనవి. ముఖ్యంగా సీతాపహరణం తరువాత హనుమంతుడి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ పాత్రకు ఎవరు సరిపోతారన్న చర్చ అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. హనుమంతుడి శరీర దారుడ్యానికి ఏ నటుడు సరిపోతాడని అభిప్రాయాలు వినిస్తున్నాయి.

ఇక భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతుంది కాబట్టి.. అన్ని భాషల్లోనూ తెలిసిన నటీనటులను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేయాలని మూవీ యూనిట్ భావిస్తుంది. మరి ఈ క్రమంలో ఈ పాత్రకు దర్శకనిర్మాతలు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. అలాగే లక్ష్మణుడి పాత్రకు కూడా బాలీవుడ్‌ వారినే తీసుకుంటారా..? లేక దక్షిణాది వారికి అవకాశం ఇస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ ప్రశ్నలన్నింటికి ఆదిపురుష్ టీమ్ త్వరలోనే సమాధానాలు ఇస్తుందేమో చూడాలి.

Read More:

వైరల్‌ అవుతోన్న ఎన్నికల షెడ్యూల్‌.. స్పందించిన నిమ్మగడ్డ

ప్రముఖ దర్శకనిర్మాత కన్నుమూత.. బాలీవుడ్‌లో మరో విషాదం