మహేష్‌కు మెగాస్టార్.. బన్నీకి పవర్‌స్టార్..?

వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతోంది. సూపర్‌స్టార్, స్టైలిష్‌స్టార్ ఇద్దరు వచ్చే సంక్రాంతిని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కాగా ముందుగా ఈ ఇద్దరు హీరోలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు. కానీ నిర్మాతల మధ్య చర్చతో ఒక్క రోజు గ్యాప్‌తో(సరిలేరు నీకెవ్వరు జనవరి 11న.. అల వైకుంఠపురంలో 12న ) వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్క రోజు గ్యాప్ ఉందిలే అన్న మాటే గానీ.. ఎలాగైనా తామే పెద్ద […]

మహేష్‌కు మెగాస్టార్.. బన్నీకి పవర్‌స్టార్..?

Edited By:

Updated on: Dec 22, 2019 | 5:23 PM

వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతోంది. సూపర్‌స్టార్, స్టైలిష్‌స్టార్ ఇద్దరు వచ్చే సంక్రాంతిని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కాగా ముందుగా ఈ ఇద్దరు హీరోలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు. కానీ నిర్మాతల మధ్య చర్చతో ఒక్క రోజు గ్యాప్‌తో(సరిలేరు నీకెవ్వరు జనవరి 11న.. అల వైకుంఠపురంలో 12న ) వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్క రోజు గ్యాప్ ఉందిలే అన్న మాటే గానీ.. ఎలాగైనా తామే పెద్ద హిట్ కొట్టాలని ఇరు మూవీ యూనిట్‌లు గట్టిగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు టీంల మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ జరుగుతోంది(ఈ వార్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య కూడా కొనసాగుతుంది).

ఇందులో భాగంగా మొదటిసారిగా ఓ అడుగు ముందుకేసింది అల వైకుంఠపురంలో టీం. పోస్టర్లను పక్కనపెడితే ఈ మూవీ నుంచి సామజవరగమ పాటను విడుదల చేశారు. అంతే ఆ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో మూవీపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక ఆ తరువాత రాములో రాముల, ఓ మై గాడ్ మై డాడీ పాటలు కూడా అందరినీ ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు తమ సినిమా గురించి మాట్లాడేలా తమ వైపు తిప్పుకుంది అల వైకుంఠపురంలో టీమ్. మరోవైపు వీటిని పెద్దగా పట్టించుకోని సరిలేరు టీమ్.. నిదానంగానే తమ ప్రమోషన్లను ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి కూడా మూడు పాటలు వచ్చాయి. కానీ పాటల విషయంలో అలను ఢీకొట్ట లేకపోయింది సరిలేరు యూనిట్. ఇలా పాటల విషయంలో కాస్త వెనకబడ్డ సరిలేరు టీమ్.. ప్రమోషన్లలో భాగంగా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ విషయంలో మాత్రం మొదట్లోనే అలర్ట్ అయ్యింది.

ప్రీ రిలీజ్ వేడుకకు తేదీని ఖరారు చేయడంతో పాటు మెగాస్టార్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. దీంతో మెగా ఫ్యాన్స్ దృష్టి ఇప్పుడు తమ వైపు తిప్పుకుంది సరిలేరు యూనిట్. అయితే ఈ విషయంలో ఇంకా వెనకాలే ఉంది బన్నీ టీమ్. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ విషయంలో అల యూనిట్ కాస్త డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ వేడుకకు చిరంజీవి ప్రధానాకర్షణ అవ్వనుండగా.. తమ వేడుకకు ఎవరిని పిలవాలా..? అని మూవీ యూనిట్ ఆలోచిస్తుందట( అయితే బన్నీ టీమ్ మొదట చిరునే అనుకున్నారట. కానీ ఆ లోపే మహేష్ నిర్మాత అనిల్ సుంకర మెగాస్టార్‌ను ఒప్పించుకోవడంతో వారు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు టాక్). ఈ క్రమంలో పవన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా పలువురి పేర్లను వారు పరిశీలిస్తున్నారట. ఇక పవన్‌, త్రివిక్రమ్‌ ఎలాగూ మంచి స్నేహితుడు కాబట్టి.. ఆయనను పిలిస్తే కచ్చితంగా వస్తాడని నిర్మాతలు అనుకుంటున్నారట. దీంతో ఆయనతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన రావడం కుదరకపోతే…  చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరినీ పిలిపించాలని అనుకుంటున్నారట. ఆర్ఆర్ఆర్‌లో వీరిద్దరు కలిసి నటిస్తుండగా.. ఆ ఇద్దరు తమ వేడుకకు వస్తే సినిమాకు మరింత క్రేజ్ రావొచ్చని ‘అల’ టీమ్ అనుకుంటుందట. అంతేకాదు ‘సరిలేరు నీకెవ్వరు’కు పోటీ ఇచ్చేలా.. తమ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా చేయాలని బన్నీ నిర్మాతలు అనుకుంటున్నారట. మరి మొత్తానికి అక్కడ చిరుకు గట్టి పోటీ ఇవ్వడానికి.. ఇక్కడ అల టీమ్ ఎవరినీ గెస్ట్‌గా తీసుకురానుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.