ప్రధాని మోదీపై వెబ్‌సిరీస్

| Edited By:

Mar 14, 2019 | 6:32 AM

ప్రధాని నరేంద్ర మోదీపై బాలీవుడ్‌లో బయోపిక్ తీస్తుండగా మరోవైపు ఆయన జీవితంపై వెబ్‌సిరీస్‌ కూడా రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ మోదీపై వెబ్‌సిరీస్ తీస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌ను ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు. ‘ఓ మై గాడ్’, ‘102 నాట్ అవుట్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉమేశ్ శుక్లా ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆరెస్సెస్‌లో చేరి 12వ ఏట రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి మోదీ జీవిత చరిత్రను పది […]

ప్రధాని మోదీపై వెబ్‌సిరీస్
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీపై బాలీవుడ్‌లో బయోపిక్ తీస్తుండగా మరోవైపు ఆయన జీవితంపై వెబ్‌సిరీస్‌ కూడా రెడీ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ మోదీపై వెబ్‌సిరీస్ తీస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌ను ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు. ‘ఓ మై గాడ్’, ‘102 నాట్ అవుట్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉమేశ్ శుక్లా ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.

ఆరెస్సెస్‌లో చేరి 12వ ఏట రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి మోదీ జీవిత చరిత్రను పది భాగాలుగా తీస్తున్నామని నిర్మాతలు తెలిపారు. 2001లో గుజారాత్ సీఎం, 2014లో పీఎం లాంటి ముఖ్యమైన ఘట్టాలను కూడా చూపించనున్నారు. నరేంద్ర మోదీ పాత్రల్లో వివిద దశల్లో ఫైజల్ ఖాన్, అశిష్ శర్మ, మహేశ్ ఠాకూర్‌లు నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు ‘మోదీ’ అనే టైటిల్‌నే ఖరారు చేశారు.

మరోవైపు ‘పీఎం నరేంద్రమోదీ’ పేరుతో మోదీ బయోపిక్ తెరకెక్కుతోంది. వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న ఈ బయోపిక్‌లో మనో జోషి, జరీనా వాహెబ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి మొత్తం 23 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సురేశ్ ఒబెరాయ్, సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.