అర్జున్ సురవరం నుంచి తికమక మకతిక సాంగ్ విడుదల

|

Mar 18, 2019 | 12:25 PM

హైదరాబాద్: నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ సురవరం’ చిత్ర విడుదలకు సిద్ధమౌతోంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అలుపు సొలుపుల నడుమల బతుకు.. వార్తల కొరకు ఉరుకు ఉరుకు అని అంటూ ఆ పాట సాగింది. ఈ పాట తెలంగాణ యాసలో ఉంది. ఇందులో నిఖిల్ ఒక రిపోర్టర్‌గా కనిపించాడు. వృత్తికి సంబంధించిన ఒడిదుడుకుల నేపథ్యంలో పాట సాగింది. జర్నలిజం ఇతివృత్తంతో ఈ మూవీని […]

అర్జున్ సురవరం నుంచి తికమక మకతిక సాంగ్ విడుదల
Follow us on

హైదరాబాద్: నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ సురవరం’ చిత్ర విడుదలకు సిద్ధమౌతోంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అలుపు సొలుపుల నడుమల బతుకు.. వార్తల కొరకు ఉరుకు ఉరుకు అని అంటూ ఆ పాట సాగింది. ఈ పాట తెలంగాణ యాసలో ఉంది. ఇందులో నిఖిల్ ఒక రిపోర్టర్‌గా కనిపించాడు. వృత్తికి సంబంధించిన ఒడిదుడుకుల నేపథ్యంలో పాట సాగింది. జర్నలిజం ఇతివృత్తంతో ఈ మూవీని చిత్రించారు.

సామ్ సీఎస్ సంగీతం అందించగా, వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించారు. రాజ్ కుమార్ – వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ దర్శకత్వం వహించారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.