సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఆఫర్‌ని కంగనా రనౌత్ వదులకున్నారట. ఈ విషయాన్ని కంగనా టీమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్‌లోని ప్రముఖులపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ సైతం బాలీవుడ్‌లో నెపోటిజంపై బహిరంగంగా విమర్శలు చేశారు. కొందరి చేతుల్లోనే బాలీవుడ్ ఉందని ఆమె మండిపడ్డారు. ఇదిలా ఉంటే తమ సంస్థ ఎంతో మంది కొత్త వారిని బాలీవుడ్‌కి పరిచయం చేసిందని.. కంగనాను సైతం గ్యాంగ్‌స్టర్ మూవీతో తామే పరిచయం చేశామని నటి పూజా భట్(మహేష్ భట్ కుమార్తె) సోషల్ మీడియాలో ఓ కామెంట్ చేశారు.
ఇక దీనిపై స్పందించిన కంగనా టీమ్.. ”గ్యాంగ్‌స్టర్ మూవీతో పాటు పోకిరి చిత్రానికి కూడా కంగనా అడిషన్‌కి వెళ్లారు. ఆ రెండింటికి సెలక్ట్ అయ్యారు. పోకిరి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మీరే ఆలోచించండి పెద్ద విజయం సాధించని గ్యాంగ్‌స్టర్ వలనే కంగనా ఈ స్థానంలో ఉందనుకుంటున్నారేమో. నీరు తన స్థానాన్ని అది కనుగొంటుంది” అని వెల్లడించింది. అంతేకాదు తన టాలెంట్‌తోనే కంగనా అవకాశాలను తెచ్చుకున్నారని ఆమె టీమ్ తెలిపింది. అనురాగ్ బసు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వడంతోనే కంగనా పోకిరి ఆఫర్‌ని వదులుకున్నట్లు వివరించింది.
కాగా పోకిరిలో మహేష్ సరసన ఇలియానా నటించింది. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వడంతో పాటు ఇలియానాకు మంచి ఆఫర్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
For your info @PoojaB1972 Kangana had also auditioned for Pokiri, alongside Gangster & got selected for that as well. Pokiri went on to become an all time blockbuster, so your thinking that because of Gangster she is who she is, is totally not working. Water finds it’s level?
— Kangana Ranaut (@KanganaTeam) July 8, 2020