
Gutta Jwala Vishnu Vishal: ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని యువ నటుడు విష్ణు విశాల్ అన్నారు. కోలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్న ఆయన.. తాజాగా నటించిన చిత్రాల్లో కాడన్ చిత్రం ఒకటి. పాన్ ఇండియగా రూపొందిన ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం తాను నటించిన నాలుగు చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయని తెలిపారు. అందులో తాను సొంతంగా నిర్మించి, కథానాయకుడిగా నటిస్తున్న ఎఫ్‌ఐఆర్ , మోహన్ దాస్ చిత్రాలు కూడా ఉన్నాయని అన్నారు. అదే విధంగా త్వరలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాలాను పెళ్లడబోతున్నట్లు పేర్కొన్నారు.
అయితే తమది ప్రేమ వివాహం కాదని, ఇంతకు ముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవతం చేదు అనుభవాన్నే మిగిల్చిందన్నారు. అందువల్ల తాను జ్వాలా ఒకరిఒకరం అర్థం చేసుకుని గౌరవించుకుని చేసుకుంటున్న వివాహమని అన్నారు. గుత్తాజ్వాల ఒలింపిక్‌లో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్న విషయం తెలిసిందే అని అన్నారు. ఆమె గురించి పలు అనుభవాలను తనతో పంచుకున్నారని, ఆమె బయోపిక్‌ను సినిమాగా తెరకెక్కించాలని ఆలోచన తనకు ఉందని అన్నారు. కాడన్ చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందన్నారు.
US President Joe Biden: అమెరికాలో పెట్రోల్, డీజిల్ కార్లకు మంగళం.. డెడ్‌లైన్ ఇచ్చేసిన జో బైడెన్
Kangana Ranaut: నేషనల్ అవార్డ్ చేజిక్కించుకున్న కంగన రనౌత్.. నాలుగుసార్లు జాతీయ పురస్కారం ఆమె సొంతం