మళ్లీ ఆసుపత్రిలో చేరిన నటుడు విజయ్‌కాంత్‌

ప్రముఖ కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో గత నెల 22న ఆయన చెన్నైలోని

మళ్లీ ఆసుపత్రిలో చేరిన నటుడు విజయ్‌కాంత్‌

Edited By:

Updated on: Oct 07, 2020 | 1:44 PM

Vijayakanth joined hospital: ప్రముఖ కోలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కాంత్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో గత నెల 22న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో చికిత్స పొందారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకొని ఈ నెల 2న ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మంగళవారం సాయంత్రం మరోసారి విజయ్‌కాంత్‌ ఆసుపత్రిలో చేరారు.

మరోవైపు విజయ్‌కాంత్ ఆరోగ్యంపై డీఎండీకే పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న విజయ్‌కాంత్‌, తదుపరి ఆరోగ్య పరీక్షల నిమిత్తం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. విజయ్‌కాంత్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి అని ప్రకటనలో పేర్కొన్నారు.

Read More:

ట్రక్కును పేల్చిన ఉగ్రవాదులు.. 19 మంది మృతి

ఆ ప్రసక్తే లేదు.. ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చిన కాజల్‌