Kushi Movie: ద్రాక్షారామంలో ‘ఖుషి’ సినిమా క్లైమాక్స్.. సాంప్రదాయ దుస్తుల్లో సామ్, విజయ్..

| Edited By: Rajitha Chanti

Jul 05, 2023 | 7:28 PM

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం ఖుషీ. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో క్యూరియాసిటి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ నా రోజా నువ్వే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Kushi Movie: ద్రాక్షారామంలో ఖుషి సినిమా క్లైమాక్స్.. సాంప్రదాయ దుస్తుల్లో సామ్, విజయ్..
Kushi
Follow us on

డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం ఖుషీ. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో క్యూరియాసిటి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ నా రోజా నువ్వే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కేరళ, రామోజీ ఫిలిం సిటీ, కశ్మీర్ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. తాజాగా కాకినాడ ద్రాక్షారామం పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ షూటింగ్ చేశారు.

తాజాగా ద్రాక్షారామ శ్రీ మాణి క్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఖుషీ సినిమా సందడి నెలకొంది. ద్రాక్షారామం ఆలయంలో ఖుషి సినిమా చివరి షెడ్యూల్డ్ చిత్రీకరణ జరిగింది. విజయ దేవర కొండ, సమంత హీరో హీరోహీరోయిన్ ల పై పలు సన్నివేశాలు షూట్ చేశారు. ఇందుకు సంబంధించి షూటింగ్ స్పాట్ నుంచి చిన్న వీడియో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో ద్రాక్షారామం గుడిలో కుటుంబసభ్యులంతా యాగం చేస్తున్నట్లు చూపించారు. సమంత రెడ్ కలర్ చీర కట్టుకోగా.. విజయ్ పంచెకట్టులో కనిపించారు. ఇలా సాంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరూ నమస్కారం పెట్టారు. దీంతో వీడియోస్ వైరలవుతున్నాయి.

ఈ సందర్భంగా డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ” సమంతతో రెండవ చిత్రం చేస్తున్నాను. పూర్తి ప్రేమ కథా ( లవ్ స్టోరీ ) చిత్రంగా ఖుషి తెరకెక్కిస్తున్నాము. కుటుంబసమేతంగా ఈ చిత్రాన్ని తిలకించే విధంగా ఉండబోతుంది. ఇటువంటి మంచి చిత్రాలను ఆదరించాలి. గోదావరి జిల్లాల్లో లొకేషన్స్ బాగుంటాయి. ద్రాక్షారామ గుడి చాలా బాగుంది. ఈ గుడిలో షూటింగ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.ఖుషి చిత్రాన్ని చూసి బాగా ఎంజాయ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.