Vijay Devarakonda: కన్నడలోకి రీమేక్ కానున్న విజయ్ దేవరకొండ సినిమా.. ఏ మూవీ అంటే ?..

| Edited By: Pardhasaradhi Peri

Dec 30, 2020 | 1:30 PM

అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయం సాధించడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ సినిమాలను తన

Vijay Devarakonda: కన్నడలోకి రీమేక్ కానున్న విజయ్ దేవరకొండ సినిమా.. ఏ మూవీ అంటే ?..
Follow us on

అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయం సాధించడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అటు హీరోగానే కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు ఈ యంగ్ హీరో. కింగ్ ఆఫ్ ది హిల్ ఆనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై మొదటగా మీకు మాత్రమే చెప్పా అనే సినిమాను తెరకెక్కించాడు. పెళ్ళి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఇందులో ప్రధాన పాత్రలో నటించాడు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను కన్నడలోకి రీమేక్ చేయబోతున్నారట. తెలుగులో ఈ చిత్రానికి షామిర్ సుల్తాన్ దర్శకత్వం వహించగా కన్నడ రీమేక్‏కు శివగణేష్ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో శివగణేష్ డీ16, జిగర్తండ అనే సినిమాలను కన్నడలోకి రీమేక్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఎస్.హెచ్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్, హరీష్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.