Vijay Devarakonda Liger Movie: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం లైగర్ (Liger). బాలీవుడ్ భామ అనన్యాపాండే (Ananya Pande) హీరోయిన్‌గా నటిస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది లైగర్ మూవీ యూనిట్. ఇందులో భాగంగా ఇటీవలే గ్రాండ్‌గా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో లైగర్ ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్ల వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
అదేంటంటే లైగర్ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కళ్లుచెదిరే ధరకు అమ్ముడుపోయాయట. ప్రముఖ దిగ్గజ సంస్థ స్టార్ గ్రూప్ రూ. 55 కోట్లకు విజయ్ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిందట. ఓ యంగ్ హీరోకు ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడం విశేషమనే చెప్పుకోవాలి. అందులోనూ విజయ్ గత చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఈనేపథ్యంలో లైగర్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ సినిమాను కరణ్ జోహర్, ఛార్మీతో కలిసి పూరీ స్వయంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆగస్టు 25న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో లైగర్ రిలీజ్ కానుంది. విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తోన్న ఈ సినిమా రేపు మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Vijay Deverakonda’s #Liger satellite and digital rights bagged by Star group for ₹55 crores.
— LetsOTT Global (@LetsOTT) July 22, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..