Vijay Devarakonda- Samantha: ‘ఖుషి’ టైటిల్‌తో వచ్చేసిన విజయ్‌ దేవరకొండ, సమంత.. అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌..

Vijay Devarakonda- Samantha: ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్‌ను ఖరారు చేసిన మూవీ మేకర్స్‌ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతల ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో విజయ్‌- సమంతలు ఎంతో లవ్లీగా, చూడముచ్చటగా కనిపిస్తున్నారు.

Vijay Devarakonda- Samantha: ఖుషి టైటిల్‌తో వచ్చేసిన విజయ్‌ దేవరకొండ, సమంత.. అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌..
Vijay Devarakonda And Saman

Edited By: Ravi Kiran

Updated on: May 16, 2022 | 6:58 PM

Vijay Devarakonda- Samantha: మహానటి సినిమాలో కలిసి నటించిన విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) , సమంత (Samantha) మళ్లీ స్ర్కీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు. ఈసారి మరింత రొమాంటిక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందుకు తగ్గట్లే సినిమాకు ఖుషి (Kushi) అని టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. నిన్నుకోరి, మజిలీ, టక్‌ జగదీష్‌ లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే కశ్మీర్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడే రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్‌ను ఖరారు చేసిన మూవీ మేకర్స్‌ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతల ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

రొమాంటిక్ లుక్ లో..

ఇవి కూడా చదవండి

ఈ లుక్‌లో విజయ్‌- సమంతలు ఎంతో లవ్లీగా, చూడముచ్చటగా కనిపిస్తున్నారు. విజయ్, సమంత కెరీర్ లలో ఇదొక మెమొరబుల్ ఫిల్మ్ గా మిగులిపోతుందనే వైబ్స్ టైటిల్, ఫస్ట్ లుక్ తో ఏర్పడుతున్నాయి. ప్రేమలో గెలిస్తే ఖుషి, ఆ ప్రేమను కుటుంబంతో పంచుకుంటే మరింత ఖుషి. జీవితంలో ఈ సంతోషాన్ని మించిన సంపద లేదు అన్నట్లు ఖుషి టైటిల్, ఫస్ట్ లుక్ డిజైన్ క్రియేటివ్ గా ఉండి ఆకట్టుకుంటున్నాయి. కాగా డిసెంబర్ 23,2022 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు.

కాగాగతంలో పవన్‌ కల్యాణ్‌, భూమిక కాంబినేషన్‌లో ఖుషి అనే సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో విజయ్‌ దేవరకొండ, సమంత వస్తున్నారు. దీంతో పవర్‌స్టార్‌ లాగే ఈసినిమా కూడ బ్లాక్ బస్టర్‌ హిట్‌ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Rashmika Mandanna: స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసిన రష్మిక.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

D Imman: రెండో పెళ్లి చేసుకున్న స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

Sarkaru Vaari Paata collections: బాక్సాఫీస్‌పై సర్కారు వారి పాట దండయాత్ర.. మూడు రోజుల టోటల్‌ కలెక్షన్స్ ఎంతంటే..