Vignesh: ఆ క్షణమే నయన్‌తో ప్రేమలో పడిపోయా.. తొలిసారి తమ లవ్‌స్టోరీ పంచుకున్న విఘ్నేష్‌

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న క్యూట్‌ కపుల్స్‌లో నయనతార, విఘ్నేష్‌లు ఒకరు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది జూన్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం సరోగసి విధానం ద్వారా ఈ క్యూట్ కపుల్‌ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం విధితమే. ఇదిలా ఉంటే తొలిసారి విఘ్నేశ్‌ తమ...

Vignesh: ఆ క్షణమే నయన్‌తో ప్రేమలో పడిపోయా.. తొలిసారి తమ లవ్‌స్టోరీ పంచుకున్న విఘ్నేష్‌
Nayanthara Vignesh

Updated on: Apr 15, 2023 | 9:39 PM

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న క్యూట్‌ కపుల్స్‌లో నయనతార, విఘ్నేష్‌లు ఒకరు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది జూన్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం సరోగసి విధానం ద్వారా ఈ క్యూట్ కపుల్‌ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం విధితమే. ఇదిలా ఉంటే తొలిసారి విఘ్నేశ్‌ తమ ప్రేమ కథను పంచుకున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

ఈ విషయమై విఘ్నేశ్‌ మాట్లాడుతూ.. ‘కెరీర్‌లో కష్టాల్లో ఉన్న సమయంలో నేనూ రౌడీనే కథ రాశాను. ఆ సమయంలో ధనుష్‌, నయనతారను కలిసి కథ చెప్పమన్నారు. ఆ సమయంలో నయన్‌ నన్నెంతో గౌరవించింది. ఆ క్షణమే తనతో ప్రేమలో పడిపోయా. సినిమా రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ నుంచే మేమిద్దరం డేటింగ్‌ మొదలు పెట్టాం. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామనే విషయం మేము చెప్పేవరకూ ఎవరికీ తెలియలేదు. సెట్‌లో నయన్‌ని మేడమ్‌ అనే పిలిచేవాడిని. చివరికి ఆమె కారవ్యాన్‌లోకి కూడా వెళ్లేవాడిని కాదు’ అని చెప్పుకొచ్చాడు.

ఇక తమకు సింపుల్‌గా జీవించడమే ఇష్టమన్న విఘ్నేశ్‌… ఇటీవల తాము ట్రైన్‌లోనూ జర్నీ చేశాని చెప్పుకొచ్చారు. అందరూ దాన్ని పెద్ద విషయంగా చూశారన్నారు. ఫ్లైట్‌లో వెళితే ఇంటికి చేరుకోవడానికి రాత్రి అవుతుందన్న కారణంతో రైలులో బయలుదేరామని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అభిమానులు ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారన్న విఘ్నేశ్.. వాళ్ల ప్రేమాభిమానాన్ని, అర్థం చేసుకోగలనని, కానీ, కొన్ని పరిస్థితుల్లో వాళ్లను ఎలా అదుపు చేయాలో అర్థం కాదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..