‘మహర్షీ’..నువ్వు నచ్చావయ్యా!

|

May 15, 2019 | 12:18 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్లు దాటాయి. ఫాదర్ సెంటిమెంట్, ఫ్రెండ్ షిప్ ఎమోషన్, వ్యవసాయ ఇతివృత్తం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  సాధారణ ప్రేక్షకులతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు చాలామంది సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  ‘మహర్షి’ సినిమా ప్రయత్నాన్ని అభినందించారు.  వ్యవసాయ ప్రాధాన్యతను, గ్రామీణ నేపథ్యాన్ని నేటి తరానికి తెలియజెప్పడానికి చేసిన […]

మహర్షీ..నువ్వు నచ్చావయ్యా!
Follow us on

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్లు దాటాయి. ఫాదర్ సెంటిమెంట్, ఫ్రెండ్ షిప్ ఎమోషన్, వ్యవసాయ ఇతివృత్తం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  సాధారణ ప్రేక్షకులతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు చాలామంది సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  ‘మహర్షి’ సినిమా ప్రయత్నాన్ని అభినందించారు.  వ్యవసాయ ప్రాధాన్యతను, గ్రామీణ నేపథ్యాన్ని నేటి తరానికి తెలియజెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర హీరో, దర్శకనిర్మాతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన ‘కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం.  ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా.  గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’.  సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను’ అన్నారు.

ఉపరాష్ట్రపతి ప్రశంసలపై హీరో మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విట్టర్ ద్వారా స్పందించారు. చాలా గర్వంగా భావిస్తున్నట్టు తెలిపారు.