ఆసక్తికరంగా ‘వెంకీమామ’ టైటిల్‌ లోగో

| Edited By:

Apr 05, 2019 | 5:57 PM

దగ్గుబాటి హీరో వెంకటేష్, అక్కినేని హీరో నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘వెంకిమామ’. కాగా స్వతహాగా వెంకటేష్‌కు నాగచైతన్య మేనల్లుడు అన్న విషయం తెలిసిందే. ‘వెంకిమామ’  సినిమా రీసెంట్ గా ప్రారంభమై..శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యంగ్ డైరక్టర్ బాబీ ఈ సినిమాను పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. డి సురేష్ బాబు,  కోన వెంకట్‌లు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. కాగా వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. […]

ఆసక్తికరంగా ‘వెంకీమామ’ టైటిల్‌ లోగో
Follow us on

దగ్గుబాటి హీరో వెంకటేష్, అక్కినేని హీరో నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘వెంకిమామ’. కాగా స్వతహాగా వెంకటేష్‌కు నాగచైతన్య మేనల్లుడు అన్న విషయం తెలిసిందే. ‘వెంకిమామ’  సినిమా రీసెంట్ గా ప్రారంభమై..శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యంగ్ డైరక్టర్ బాబీ ఈ సినిమాను పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. డి సురేష్ బాబు,  కోన వెంకట్‌లు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు.

కాగా వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా  ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. టైటిల్ లోగోను రెండు భాగాలుగా కనిపించేలా డిజైన్ చేసి..కొద్ది, కొద్దిగా హింట్స్ ఇచ్చింది మూవీ టీం.  పల్లెటూరు వెంకి అనే పేరుతో కనెక్టయితే… మామ అనే పేరు యుద్ధభూమిలో కనెక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేశారు.  వెంకటేష్ పల్లెటూరిలో ఉండే వ్యక్తిగా కనిపిస్తే.. నాగచైతన్య సైనికుడిగా కనిపించబోతున్నాడని అర్ధమవుతోంది.  ఈ ఏడాది ‘ఎఫ్ 2’ తో వెంకటేష్ సూపర్ హిట్ అందుకోగా, ఈ రోజు రిలీజైన ‘మజిలీ’ తో నాగచైతన్య డీసెంట్ హిట్ అందుకున్నాడు.