ఆసుపత్రిలో చేరిన వివాదాస్పద నటి భర్త

| Edited By:

Aug 26, 2020 | 8:55 AM

వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ భర్త పీటర్ పాల్‌ ఆసుపత్రిలో చేరారు. చెస్ట్‌ పెయిన్ రావడంతో అతడిని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చేరిన వివాదాస్పద నటి భర్త
Follow us on

Vanita Vijaykumar husband: వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ భర్త పీటర్ పాల్‌ ఆసుపత్రిలో చేరారు. చెస్ట్‌ పెయిన్ రావడంతో అతడిని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని వనితా సోషల్ మీడియాలో వెల్లడించారు. ”చాలా చెప్పాలని ఉంది. నేనేం చేయలేదు. దేవుడు గొప్పవాడు. ప్రతీది ఒక కారణంతోనే జరుగుతుందని నేను నమ్ముతాను. జీవితం చాలా కష్టమైంది. అన్నీ సర్ధుకుంటాయి” అని ట్వీట్ చేశారు.

కాగా పీటర్‌ పాల్‌ని వనితా ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నాడంటూ అతడి మొదటి భార్య ఆరోపణలు చేసింది. దీనిపై ఆమె కేసు కూడా నమోదు చేసింది. ఈ క్రమంలో పలువురు వనితాపై విమర్శలు చేశారు. అందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక ఈ వివాదాన్ని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని వనితా-పీటర్ పాల్‌ ఓ ప్రకటనను చేశారు. అయినా ఈ వివాదం ఇంకా ఇప్పటికీ సద్దుమణగలేదు.

Read More:

కరోనా నెగిటివ్‌.. నా వద్ద కూరగాయలు కొనొచ్చు

కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన కీలక పత్రాలు