vamshi paidipally : రామ్ చరణ్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ డైరెక్టర్.. మరోసారి ‘ఎవడు’ కాంబినేషన్.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరిగా చరణ్ కనిపించనున్నాడు..

vamshi paidipally : రామ్ చరణ్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ డైరెక్టర్.. మరోసారి ఎవడు కాంబినేషన్.?

Updated on: Jan 11, 2021 | 9:37 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరిగా చరణ్ కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ రెండు సినిమాలతర్వాత చెర్రీ ఎవరితో సినిమా చేస్తాడన్నదానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈక్రమంలోనే గతంలో ‘ధ్రువ’ సినిమాతో తనని కొత్తగా చూపించిన సురేందర్ రెడ్డితో చేయాలని చూస్తున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. కానీ చరణ్ ప్రస్తుతం తను చేస్తున్న ప్రాజెక్టుల నుంచి పూర్తిగా బయటపడటానికి మరికొంత కాలం పడుతుంది. అందువలన అఖిల్ సినిమా చేయడానికి సురేందర్ రెడ్డి రంగంలోకి దిగాడు. ఇక మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తర్వాత మరో సినిమా చేయాలనీ వంశీ పైడి పల్లి ట్రై చేసిన అది కుదరలేదు. ఇప్పట్లో మహేశ్ బాబు ఖాళీ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అందువలన చరణ్ ను లైన్లో పెట్టడానికి వంశీ పైడిపల్లి ట్రై చేస్తున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరై కాంబినేషన్ లో ‘ఎవడు’ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మరి వంశీకి చరణ్ ఓకే చెప్తాడేమో చూడాలి.