AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ ‘వకీల్ సాబ్’.. మరో మూడు నెలలు పట్టనుందా..!

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం 'వకీల్ సాబ్'. బాలీవుడ్‌లో పెద్ద విజయం సాధించిన 'పింక్'‌ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

పవన్ 'వకీల్ సాబ్'.. మరో మూడు నెలలు పట్టనుందా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 02, 2020 | 5:24 PM

Share

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్‌లో పెద్ద విజయం సాధించిన ‘పింక్’‌ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మొదట మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. అయితే కరోనా రావడంతో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇక ఈ నెల నుంచి తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతి లభించడంతో.. త్వరలోనే వకీల్‌ సాబ్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ పూర్తయ్యే సరికి మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. మూవీకి సంబంధించిన షూటింగ్ 35 రోజులు ఉండగా.. మిగిలిన పనులన్నీ పూర్తయ్యే సరికి దాదాపుగా మూడు నెలలు పట్టనుందట. ఈ క్రమంలో ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నట్లు టాక్. కాగా ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రుతీ హాసన్ నటిస్తోంది. నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై పవన్‌ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: వలస కూలీల కోసం ముందుకొచ్చిన షమీ.. నెటిజన్ల ప్రశంసలు..!

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం