URVASHI RAUTELA: రిషబ్ పంత్ కు ఊర్వశి రౌతేలా దిమ్మతిరిగే కౌంటర్.. పిల్ల బచ్చా అంటూ ఘాటు వ్యాఖ్యలు..

|

Aug 12, 2022 | 1:30 PM

భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య మాటల యుద్ధ తారాస్థాయికి చేరింది. గతంలో తన కోసం చాలా సేపు ఎయిర్ పోర్టులో RP అనే వ్యక్తి వెయిట్ చేశాడంటూ పరోక్షంగా రిషబ్ గురించి

URVASHI RAUTELA: రిషబ్ పంత్ కు ఊర్వశి రౌతేలా దిమ్మతిరిగే కౌంటర్.. పిల్ల బచ్చా అంటూ ఘాటు వ్యాఖ్యలు..
Rishab
Follow us on

URVASHI RAUTELA: భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య మాటల యుద్ధ తారాస్థాయికి చేరింది. గతంలో తన కోసం చాలా సేపు ఎయిర్ పోర్టులో RP అనే వ్యక్తి వెయిట్ చేశాడంటూ పరోక్షంగా రిషబ్ గురించి ప్రస్తావించింది. దీనిపై రిషబ్ పంత్ తాజాగా స్పందించగ.. ఉర్వశి రౌతేలా దానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇప్పడు వీళ్లద్దరి మాటల యుద్ధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అసలు ఏం జరిగిందంటే… ఇటీవల ఊర్వశి రౌతేలా కోసం రిషబ్ పంత్ ఎయిర్ పోర్టులో గంటల తరబడి వేచిచూశాడని… వీరద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే వీటిపై ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ.. తన కోసం RP అనే వ్యక్తి గంటల తరబడి వేచి చూశాడని చెప్పింది. తాను షూటింగ్ కి వెళ్లి అలసిపోవడం వలన జర్నిలో పడుకుండుపోయానని.. లేచి చూసే సరికి RP నుంచి 16 నుంచి 17 మిస్ట్ కాల్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఆర్పీ ఎవరనీ అడగ్గా తాను పేరు చెప్పలేనని దాటవేసింది. దీంతో ఆర్పీ అంటే రిషబ్ పంత్ అనే అభిప్రాయానికి వచ్చారు.

ఊర్వశి వ్యాఖ్యలు వైరల్ కావడంతో రిషబ్ పంత్ స్పందిస్తూ.. ఆమె పేరు ప్రస్తావించకుండానే కొంత మంది ఫేమ్ కోసం అబద్ధాలు ఎలా ఆడతారో కూడా తెలియదని.. వారి స్వార్థం కోసం అవతలి వ్యక్తుల్ని బలి చేస్తారనే అర్థం వచ్చేలా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ప్లీజ్ అక్క నన్ను వదిలేయంటూ హ్యాష్ ట్యాగ్ తో కౌంటరిచ్చాడు ఈయంగ్ క్రికెటర్.. రిషబ్ పోస్టుపై ఊర్వశి రౌతేలా కోపం కట్టలు తెంచుకుంది. అంతేకాదు రిషబ్ పంత్ ను కౌగర్ హంటర్ అంటూ తీవ్ర విమర్శలు చేసింది. చొటా భయ్యా నువ్వు బ్యాట్ బాల్ తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీలాంటి పిల్ల బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే ఈపోస్టుకు రక్షాబంధన్ శుభాకాంక్షలు ఆర్ పీ భాటుభయ్యా అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పడు వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు