AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. ‘సీత’గా ఎవ్వరూ ఊహించని నటి!

రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్‌ రౌత్ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఆదిపురుష్‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న

Adipurush: ప్రభాస్ 'ఆదిపురుష్'‌.. 'సీత'గా ఎవ్వరూ ఊహించని నటి!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 08, 2020 | 12:10 PM

Share

Prabhas Adipurush movie: రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్‌ రౌత్ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఆదిపురుష్‌. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించనున్నారు. ఇక ఈ మూవీలో మిగిలిన పాత్రాధారులకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో ఇందులో సీత పాత్రకు గానూ కీర్తి సురేష్, కియారా అద్వాణీ పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ పాత్రకు గానూ మరో నటి పేరు వినిపిస్తోంది.

మాజీ మిస్ ఇండియా(2015) ఊర్వశి రౌటెలాను ఇందులో సీత పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు ఊర్వశి బాగా సరిపోతుందని భావిస్తోన్న దర్శకుడు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే  2013లో సింగ్‌ సాబ్ ద గ్రేట్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఊర్వశి.. అక్కడ పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్‌ వీడియోల్లో నటించారు. ఇప్పుడు బ్లాక్ రోజ్ అనే చిత్రంతో తెలుగుకు కూడా పరిచయం అవ్వబోతున్నారు. కానీ ఇంతవరకు ఆమె ఏ టాప్ హీరోతోనే జతకట్టలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఊర్వశిని సంప్రదిస్తున్నట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంత..? ప్రభాస్ సరసన ఎవరు నటిస్తారు..? హనుమంతుడు, లక్ష్మణుడు.. ఇలా మిగిలిన ప్రధానపాత్రల్లో ఎవరు నటిస్తారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీని టీ-సిరీస్ నిర్మిస్తోంది. 3డీలో తెరకెక్కనున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

ఇది చివరిది కాదు.. సిద్ధంగా ఉండటం మంచిది: డబ్ల్యూహెచ్‌ఓ

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ