చెర్రీతో పెళ్లైన కొత్తలో ఇబ్బందులు పడ్డా..!

రామ్ చరణ్‌తో పెళ్లైన కొత్తలో పలు విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన సతీమణి ఉపాసన కొణిదెల అన్నారు.

చెర్రీతో పెళ్లైన కొత్తలో ఇబ్బందులు పడ్డా..!

Updated on: Jun 08, 2020 | 12:37 PM

రామ్ చరణ్‌తో పెళ్లైన కొత్తలో పలు విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన సతీమణి ఉపాసన కొణిదెల అన్నారు. తాను ఇష్టపడిన ఓ సెలబ్రిటీని పెళ్లి చేసుకోవడం తన అదృష్టమని చెప్పిన ఉపాసన, పెళ్లి అయ్యాక అడ్జెస్ట్ అవ్వడం నేర్చుకున్నానని తెలిపారు. ఇక చెర్రీతో పెళ్లి తరువాత మీడియా ఫోకస్ ఎక్కువగా ఉండటం, తన మీద ట్రోల్స్‌ రావడం వంటి విషయాలు తనను ఇబ్బందులకు గురి చేశాయని ఉపాసన పేర్కొన్నారు.

ఆ తరువాత వాటికి అలవాటు పడ్డ తాను, నిదానంగా పట్టించుకోవడం మానేశానని వివరించారు. ఈ విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇచ్చిన సలహాలు తనకు బాగా పనిచేశాయని ఉపాసన చెప్పుకొచ్చారు. ఇక సినిమాల్లోనూ, ఇంట్లోనూ చెర్రీకి చాలా తేడా ఉంటుందని.. తామిద్దరం మంచి స్నేహితుల్లా ఉంటామని ఉపాసన అన్నారు. ఒకరి వృత్తిని మరొకరు గౌరవించుకుంటామని ఆమె తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం అవ్వడం వలన ఇద్దరికీ ఎంజాయ్ చేసే సమయం దొరికిందని ఉపాసన వెల్లడించారు.

Read This Story Also: ఎప్పుడైనా వారు వైసీపీలోకి రావొచ్చు.. టీడీపీ ఎమ్మెల్యేలపై కరణం వ్యాఖ్యలు

Loading...
Unable to load recommendations.
Follow Us