నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి ఎసిపోడ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలి ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అతిథిగా హాజరయ్యారు. అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుత తెగ వైరల్ అవుతోంది. ‘మా బావగారు.. మీ బాబు గారు’ అంటూ బాలయ్య ఇచ్చిన ఇంట్రోతో ఆకట్టుకుంటోంది. ఇక షోలో అన్ని నిజాలే మాట్లాడుతానని బాలయ్య బాబు.. చంద్రబాబుతో ప్రమాణం చేశాయించారు. అయితే సమయస్ఫూర్తితో సమాధానం చెప్తానంటూ చంద్రబాబు చమత్కరించారు. అరెస్టు నుంచి తాజా రాజకీయాల వరకూ.. జైలు జీవితం గురించి ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ షోలో చంద్రబాబు పంచుకున్నట్లు స్పష్టమవుతోంది. అరెస్ట్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఒకింత ఎమోషన్‌కు గురయ్యారు.
మొదటి రాత్రి జైలులో ఎలా గడిచిందో చెప్తూ ఉద్వేగానికి గురయ్యారు. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టబోమని చంద్రబాబు అన్నారు. జైలు గోడల మధ్య బాబు-పవన్ మధ్య ఏం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నూతన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక థింక్ గ్లోబలీ.. యాక్ట్ గ్లోబలీ తన స్లోగన్‌తో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం మీద ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రపంచానికి తెలిసే అవకాశాలు ఉన్నాయని ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..