AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khiladi Movie : మాస్ మాహారాజ్ రవితేజ ‘ఖిలాడి’లో మరో మలయాళీ హీరో.. కీలక పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ తమ్ముడు

మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

Khiladi Movie : మాస్ మాహారాజ్ రవితేజ 'ఖిలాడి'లో మరో మలయాళీ హీరో.. కీలక పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ తమ్ముడు
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2021 | 5:51 PM

Share

Khiladi Movie : మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ తో తన నెక్స్ట్ సినిమాను కూడా పట్టాలెక్కించేసాడు. రమేష్ వర్మ  దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఖిలాడి అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఖిలాడి మూవీని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా మరో హీరో కనిపించనున్నాడని తెలుస్తుంది. మలయాళ స్టార్‌ ఉన్ని ముకుందన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఉన్ని ముకుందన్‌ ఎలాంటి పాత్ర చేస్తాడనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ముకుందన్ గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటించిన జనతా గ్యారేజ్, అనుష్క ప్రధానపాత్రలో నటించిన భాగమతి సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. గతంలో రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ వీర సినిమా చేసాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు ఖిలాడితో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమీదఉన్నడు రమేష్ వర్మ .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Taapsee Pannu: బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్‏ రేసులో తాప్సీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

RRR Movie update : చివరిదశలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్.. భారీ ప్లాన్‌‌‌‌‌తో సిద్ధమవుతున్న దర్శకధీరుడు..

Follow Us
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
గురు ప్రదోషం.. శివుడిని ఇలా పూజిస్తే.. వ్రత కథ వినడం వల్ల కలిగే..
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..