Ranabaali: అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..! రణబాలి పై కిషన్ రెడ్డి రివ్యూ
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 16న రిలీజైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. టాక్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కూడా వస్తున్నాయి

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన రణబాలి సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న రణబాలి సినిమాపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. బ్రిటిష్ వలస పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అణచివేత, రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న కరవు పరిస్థితులు, వాటిని ఎదుర్కొంటూ ప్రజలు సాగించిన పోరాటాన్ని ఈ సినిమా ప్రతిబింబించిందని ఆయన కిషన్ రెడ్డి అన్నారు. చరిత్రలో అంతగా వెలుగులోకి రాని అంశాలను వెండితెరపైకి తీసుకురావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘రణబాలి’ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా వలస పాలన కాలం నాటి పరిస్థితులు, సామాన్య ప్రజల జీవితాలు, కరువు వంటి అంశాలను ఆడియన్స్ కు కళ్లకు కట్టినట్టు చూపించింది.
ఈ నేపథ్యంలో సినిమా గురించి స్పందించిన కిషన్ రెడ్డి.. బ్రిటిష్ పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలను, అన్యాయాలకు వ్యతిరేకంగా వారు సాగించిన పోరాటాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడం మంచి విషయం అని పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందే సినిమాలు గతాన్ని కొత్త తరాలకు పరిచయం చేయడంలో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమం చరిత్రలో ఎన్నో పోరాటాలు, అనేక మంది యోధుల త్యాగాలు ఇప్పటికీ చాలామంది ప్రజలకు తెలియాల్సి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి చారిత్రక ఘట్టాలను, ప్రాంతీయ జానపద సంప్రదాయాలను గుర్తుచేసే చిత్రాలు సమాజంలో చరిత్రపై అవగాహన పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేవలం వినోదానికే పరిమితం కాకుండా, చరిత్రలోని మరుగునపడిన అధ్యాయాలను వెలికితీస్తూ సామూహిక జ్ఞాపకాలను పరిరక్షించడంలోనూ తన వంతు పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అలాగే రణబాలి వంటి చారిత్రక నేపథ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు కృషి చేసిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ బృందానికి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.
Ranabaali brings our history, folklore and cultural heritage to life, shedding light on chapters of our past marked by colonial oppression, resistance and the enduring spirit of our people who fought for our independence. Such narratives are vital to preserving our collective memory and honouring those who stood against injustice & tyranny.
Proud to see Telugu cinema bringing these significant chapters of our history to the screen. My best wishes to @Rahul_Sankrityn, @TheDeverakonda, @iamRashmika and the entire team at @MythriOfficial on this important endeavour.
— G Kishan Reddy (@kishanreddybjp) October 16, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
