Shakunthalam-Movie : హీరోయిన్ల వేటలో గుణశేఖర్.. ‘శాకుంతలం’మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా..

|

Jan 26, 2021 | 2:18 PM

దర్శకుడు గుణశేఖర్‌ ఇటీవల ‘శాకుంతలం’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్‌ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. దగ్గుబాటి రానాతో చేయాలనుకున్న ‘హిరణ్యకశ్యప’..

Shakunthalam-Movie : హీరోయిన్ల వేటలో గుణశేఖర్.. ‘శాకుంతలం’మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా..
Follow us on

Shakunthalam-Movie : దర్శకుడు గుణశేఖర్‌ ఇటీవల ‘శాకుంతలం’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్‌ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. దగ్గుబాటి రానాతో చేయాలనుకున్న ‘హిరణ్యకశ్యప’ కంటే ముందు ఈ చిత్రం రూపొందించనున్నట్లుగా తెలుపుతూ.. ‘శాకుంతలం’కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు. ఇక దుష్యంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో సమంత పాత్రతో పాటు రెండు పాత్రలు చాలా ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. అవే ఆమె ప్రాణసఖులైన అనసూయ – ప్రియంవద పాత్రలు. శకుంతల ఆటాపాటల్లోను .. ఆమె ప్రేమ .. విరహం .. భర్తకి దూరమైన సమయంలోను వాళ్లు ఆమె కూడానే ఉంటారు. అందువలన ఈ రెండు పాత్రల కోసం క్రేజ్ ఉన్న హీరోయిన్లనే తీసుకోవాలనే ఆలోచనలోనే గుణశేఖర్ ఉన్నాడని అంటున్నారు.  మరి ఈ రెండు పాత్రలకు ఏ హీరోయిన్స్ ను ఎంచుకుంటాడో.. చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మహేశ్ స్టోరీతో పవన్ సినిమా.. ప్లాన్ చేస్తున్న డైనమిక్ డైరెక్టర్.. ఈసారైనా కన్ఫార్మ్ కానుందా ?