Saaho Movie: త్రివిక్రమ్ స్టైల్‌లో ‘సాహో’ డైలాగ్.. పంచ్‌లేస్తున్న ఫ్యాన్స్!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో.. ఏదైనా సినిమా పోస్టర్ గానీ.. ట్రైలర్ గానీ రిలీజ్ అయితే చాలు నెటిజన్లు వెంటనే కాపీనా.. లేక ఒరిజినలా అనేది చెబుతూ.. ట్రోలింగ్ చేసేస్తున్నారు. సరిగ్గా ఇలాగే తాజాగా విడుదలైన ‘సాహో’ ట్రైలర్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ టైం‌లో హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారని కామెంట్స్ చేసిన నెటిజన్లు.. ట్రైలర్ చూసి.. అందులో హైలైట్ అయిన ఒక డైలాగు బన్నీ […]

Saaho Movie: త్రివిక్రమ్ స్టైల్‌లో సాహో డైలాగ్.. పంచ్‌లేస్తున్న ఫ్యాన్స్!

Updated on: Aug 12, 2019 | 2:17 PM

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో.. ఏదైనా సినిమా పోస్టర్ గానీ.. ట్రైలర్ గానీ రిలీజ్ అయితే చాలు నెటిజన్లు వెంటనే కాపీనా.. లేక ఒరిజినలా అనేది చెబుతూ.. ట్రోలింగ్ చేసేస్తున్నారు. సరిగ్గా ఇలాగే తాజాగా విడుదలైన ‘సాహో’ ట్రైలర్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ టైం‌లో హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారని కామెంట్స్ చేసిన నెటిజన్లు.. ట్రైలర్ చూసి.. అందులో హైలైట్ అయిన ఒక డైలాగు బన్నీ సినిమా డైలాగుతో పోలుస్తున్నారు.

ఆ ట్రైలర్‌లో ‘గల్లీ సిక్స్ ఎవడైనా కొడతాడు…కానీ స్టేడియం లో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటది’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ డైలాగ్ అల్లు అర్జున్ జులాయి సినిమాలోని డైలాగ్‌తో పోలుస్తూ కాపీ అని చెప్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సుజీత్ ముందుగానే డైలాగు రాసుకుని ఉంటాడని.. అది అనుకోకుండా త్రివిక్రమ్ డైలాగుతో మ్యాచ్ అయి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా పోస్టర్స్ విషయంలోనే ధీమాగా స్పందించిన సుజీత్.. ఈ విషయంలో ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.