Tapsee Pannu : తెలుగులో హీరోయిన్ తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలతో దూసుకెళ్తున్న బ్యూటీ తాప్సీ. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంటున్న సమయంలోనే ఈ అమ్మడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ మంచి మంచి కథలను ఎంచుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది తాప్సీ.
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు, సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది తాప్సీ. అలాగే తన పైన ఎవరైనా కామెంట్స్ చేస్తే వారికి సరైన సమాదానాలు చెప్తూ ఉంటుంది ఈ చిన్నది. అయితే తాజాగా తాప్సీ ఎమోషన్ అయ్యింది. షూటర్ దాదీగా ప్రసిద్ది చెందిన షార్ప్ షూటర్ చంద్రో తోమర్ (89) శుక్రవారం మరణించారు. దాదీకి కరోనా వైరస్ సోకింది. శ్వాస ఇబ్బంది కారణంగా ఆసుపత్రి పాలైంది. చంద్రో తోమర్ సోదరి ప్రకాశి తోమర్ శుక్రవారం “మేరా సాత్ చుట్ గయా. చంద్రో కహాన్ చాలీ గయీ“ అని ట్వీట్ చేశారు. ఈ ఇద్దరి జీవిత కథతోనే 2019 లో సాండ్ కి ఆంఖ్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నటించిన తాప్సీ.. భూమీ పెడ్నేకర్ ట్విట్టర్ లో నివాళులర్పించారు. తాప్సీ స్పందిస్తూ.. మీరు ఎల్లప్పుడూ మాలో స్ఫూర్తి నింపుతారు.. గొప్పగా జీవించాలనే ఆశపడే అమ్మాయిలందరిలో మీరు ఎప్పటికీ జీవిస్తారు. అంటూ తాప్సీ ఎమోషనల్ అయ్యింది.
మరిన్ని ఇక్కడ చదవండి :